You might be interested in:
Sponsored Links
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం కీలక ప్రకటన చేశారు.వచ్చే నెలలో అన్నదాత, తల్లికివందనం పథకాలు ప్రారంభిస్తామని చంద్రబాబు తెలిపారు.పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు,బూత్ స్థాయి నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.మే 2న జరిగే అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి రావాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతిలో మూడేళ్లలోగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.సింహాచలంలో గోడకూలి ఏడుగురు భక్తులు చనిపోవడం బాధాకరమని అన్నారు
0 comment