You might be interested in:
ఈరోజు చర్చలు - అంగీకరించిన అంశాలు :-
1) SGT లకు మాన్యువల్ పద్దతిలో బదిలీలు నిర్వహిస్తారు.
2) ఉన్నతపాఠశాలల్లో 49 దాటిన తరువాత 2 వసెక్షన్ ఏర్పాటు చేస్తారు.
3) ఫౌండేషన్ పాఠశాలల్లో 20 రోల్ దాటిన తరువాత 2వ పోస్టు ఇస్తారు.
4) ఉన్నతపాఠశాలల్లో నిర్వహించే ప్రాధమిక పాఠశాలలు విడిగా నిర్వహిస్తారు.
5) వర్క్ లోడ్ ఎక్కువయ్యే సందర్భంలో వర్క్ లోడ్ ఉన్న సబ్జెక్టులకు అవసరంమేరకు అకడమిక్ ఇన్ స్ట్రక్టర్/సర్ప్లస్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తారు.
6) స్టడీ లీవ్ లో ఉన్న ఉపాధ్యాయులు ఆగస్టు 2025 లోపు చేరే వారి స్థానాలను బదిలీలలో ఖాళీగా చూపరు.
7)ప్రస్తుత బదిలీలలో బ్లాకింగ్ ఉండదు.
8) మోడల్ ప్రాధమిక పాఠశాలల్లో 1382 పి.ఎస్.హెచ్.ఎం పదోన్నతులు కల్పిస్తారు.(ఇవి ఇంకా పెరగనున్నాయి)
9) 2సార్లు రీ అపోర్షన్మెంట్ కి గురయ్యే ఉపాధ్యాయులకు 7 పాయింట్లు ఇస్తారు.
10) ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్య పరిష్కారానికి జూన్ నెలలో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
11) బదిలీల అనంతరం ఎంఈఓ, ప్రధానోపాధ్యాయుల పరస్పర బదిలీపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
11) మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 120 దాటినపుడు పి.ఎస్.హెచ్.ఎం అదనంగా (1+5) కేటాయిస్తారు
సమాంతర మాధ్యమం విషయం విద్యాశాఖ మంత్రి గారితో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటారు.
0 comment