You might be interested in:
➤ అన్ని నిబంధనలు తుంగలోకి తొక్కి భారత్ పైకి దాడులతో రెచ్చిపోతున్న పాకిస్థాన్ కు ఇండియన్ ఆర్మీ గట్టి బుద్ధి చెబుతుతోంది. నిన్నటి నుంచి పాక్ చేస్తున్న క్షిపణి, డ్రోన్ దాడులను భార
త్ తిప్పికొడుతోంది. ఈ క్రమంలో ఇవాళ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. ఆపరేషన్ సిందూర్ తదనంతరం పరిణామాలపై ఈ భేటీలో చర్చించారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నౌకాదళ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ లు హాజరైన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీని మరింత దృఢంగా తయారు చేసేందుకు అవసరమైతే టెరిటోరియల్ ఆర్మీని రంగంలోకి దించాలని ఇవాళ కేంద్రం ఆర్మీ చీఫ్ కు అధికారాలు ఇచ్చింది.
రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ:
భారత్ – పాక్ మధ్య నెలకొన్న టెన్షన్ వాతావరణం నేపథ్యంలో ఆర్మీ చీఫ్ అధికారాలను విస్తరిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెరిటోరియల్ ఆర్మీలోని అందరు అధికారులను, నమోదు చేసుకున్న సిబ్బందిని పిలవడానికి అధికారం కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దేశం క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు భారత ఆర్మీతో కలిసి ప్రత్యర్థితో తలపడేందుకు టెరిటోలన్ ఆర్మీ సిద్ధంగా ఉంటుంది. ఇందులో సిబ్బంది, అధికారులకు రెగ్యులర్ ఆర్మీ తరహాలోనే ట్రైనింగ్ ఇస్తారు. వీరంతా బయట ఉద్యోగాలు చేసుకుంటూనే స్వచ్చందంగా ఆర్మీతో పని చేస్తుంటారు. ఇందులో కనీస అర్హత సర్వీస్ పూర్తి చేసిన వారికి పింఛనుతోపాటు ఇతర ప్రయోజనాలు (క్యాంటీన్, మెడికల్, ఎల్‌టీ అలవెన్సులు) అందిస్తారు. 1962,1965, 1971 యుద్ధాల్లో భారత సైన్యంతో కలిసి ఈ టెరిటోరియల్ ఆర్మీ పనిచేశారు. అందులో ఇప్పటికిప్పుడు 14 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లను విధుల్లోకి తక్షణమే రప్పించాలని నిర్ణయించారు. పార్ట్ టైమ్ వాలంటీర్లతో కూడిన మిలటరీ రిజర్వ్ ఫోర్స్. ఇందులో అధికారులు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు, నాన్-కమిషన్డ్ ఆఫీసర్లు ఇతర సిబ్బంది ఉంటారు. వీరు భారత సైన్యంలోని వారితో సమా
0 comment