You might be interested in:
విద్యా రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యా వ్యవస్థ పనితీరును మెరుగుపర్చేందుకు ఉండవల్లిలో తన నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సుమారు మూడు గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షలో పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు పలు అంశాలపై చర్చించారని సమాచారం.
జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మెగా డీఎస్సీ (DSC) పరీక్షల నిర్వహణ
జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మెగా డీఎస్సీ (DSC) పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు ఉండకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్లు, ఇంటర్నెట్, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా ఏర్పాటు చేయాలని, టీసీఎస్ అయాన్ కేంద్రాలలో సాంకేతిక సమస్యలు ఎదురుకాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అభ్యర్థుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ సెంటర్లు నిరంతర సేవలందించేలా చూడాలని సూచించారు.
0 comment