Published : June 14, 2025
You might be interested in:
Sponsored Links
ఆంధ్రప్రదేశ్ DSC (AP DSC) పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) సందర్భంగా, జూన్ 20 మరియు 21 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసి, వాటిని జూలై 1 మరియు 2, 2025 తేదీల్లో నిర్వహించనున్నట్లు DSC కన్వీనర్ ఎం.వి. కృష్ణారెడ్డి ప్రకటించారు.
ఈ మార్పులకు సంబంధించిన కొత్త హాల్ టిక్కెట్లను జూన్ 25 నుంచి https://apdsc.apcfss.in లో అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థులు కొత్త తేదీలకు అనుగుణంగా మార్చబడిన హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరు కావాలని సూచించారు.
మిగిలిన పరీక్షల షెడ్యూల్ యథాతథంగా కొనసాగుతుంది. AP DSC పరీక్షలు జూన్ 6న ప్రారంభమై, జూలై 6, 2025 వరకు వివిధ తేదీల్లో జరగనున్నాయి.
0 comment