You might be interested in:
యావత్ దేశం ఉలిక్కిపడేలా ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది.
గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్నర్ విమానం కుప్పకూలిపోయింది.
విమాన ప్రమాదం.. భారీ ఎక్స్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్
లండన్కు వెళ్తున్న విమానం నగరంలోని మేఘాని ప్రాంతంలోని ఓ మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిపోయింది. ఆ సమయంలో భారీ పేలుడు సంభవించింది. గాల్లోకి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకారం.. విమానంలో 241 మంది ఉన్నారు. అందులో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. విమానం కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ ఆధ్వర్యంలో ఉంది. కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారికి టాటా గ్రూప్ భారీ ఎక్స్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. కోటి పరిహారం ఇవ్వనున్నట్లు టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. అలాగే విమాన ప్రమాద సమయంలో దెబ్బ తిన్న మెడికల్ కాలేజీ బిల్డింగ్ ను కూడా పునర్మిస్తామని కూడా తెలిపారు.
0 comment