You might be interested in:
ఫైన్ రైస్ డిస్ట్రిబ్యూషన్ to స్కూల్ పాయింట్ గురించి ఈరోజు జాయింట్ డైరెక్టర్ MDM &SS గారితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యాంశాలు
1. జూన్ 7, 8, 9 తేదీలలో సివిల్ సప్లైస్ వాళ్ళు రైస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. డిస్ట్రిబ్యూషన్ సమయంలో స్కూల్ HM కానీ, టీచర్ కానీ తప్పనిసరిగా స్కూల్ నందు available గా ఉండి రైస్ OTP ద్వారా తీసుకొని వలెను.
2. స్కూల్స్ reopen జూన్ 12 నుండి MDM లో ఫైన్ ఫైన్ రైస్ మాత్రమే ఉపయోగించవలెను.
3. రైస్ OTP ద్వారా తీసుకోవలెను.
4. OTP ఏ విధంగా IMMS app నందు చేయవలనన్న వివరములు గల వీడియో మీకు ఇంతకుముందే గ్రూపులో పంపియున్నాము వీడియోలో ఉన్న విధంగా రైస్ receipt IMMS app నందు సబ్మిట్ చేయవలెను.
5. స్కూల్ నందు ఎన్ని bags రైస్ రిసీవ్ చేసుకున్నారో అన్ని బ్యాగులు క్యూఆర్ కోడ్ తో స్కాన్ చేయవలసి ఉన్నది.
6. స్కూల్ ఓపెన్ జూన్ 12 మినిస్టర్స్ కానీ , లోకల్ అఫిషియల్స్ కానీ ఎవరైనా visit చేసే అవకాశం ఉన్నది.
7. ఏదైనా స్కూల్ లో HM ట్రాన్స్ఫర్ జరిగినచో ప్రస్తుతానికి పాత HM మొబైల్ కి OTP వస్తుంది. ఆ OTP ద్వారా రైస్ receipt సబ్మిట్ చేయవలెను.
8. స్కూల్స్ లో పాత బియ్యం ఉన్న ఎడల దానికి సంబంధించినవి సూచనలు డైరెక్టర్ గారు ఇచ్చిన తదుపరి పంపగలము.
0 comment