You might be interested in:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ మెగా DSC-2025 పరీక్షలపై వస్తున్న అపోహలకు సంబంధించి ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. మెగా DSC-2025 పరీక్షలు నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం, సాంకేతిక భద్రతతో, పారదర్శకంగా విజయవంతంగా నిర్వహించబడ్డాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కొంతమంది అభ్యర్థులు మరియు సోషల్ మీడియా వేదికలపై వస్తున్న వదంతుల నేపథ్యంలో, ఈ క్రింది వాస్తవాలను తెలియజేయడం జరిగింది:
సాంకేతిక భద్రతతో కూడిన CBT విధానం:
- మెగా DSC-2025 పరీక్షలు కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో (CBT) నిర్వహించబడ్డాయి.
- ప్రశ్నపత్రాల లీక్, టాంపరింగ్కు ఎలాంటి అవకాశం లేకుండా End-to-End Encrypted Paper Delivery, Real-Time Server Monitoring వంటి చర్యలు తీసుకోబడ్డాయి.
- ప్రతి అభ్యర్థి ఇచ్చిన సమాధానం స్క్రీన్ పై హైలైట్ అవుతుంది, కన్ఫర్మ్ చేసిన తరువాతే నమోదు అవుతుంది.
- 'second-to-second' ఆడిటింగ్ సిస్టమ్ ద్వారా నమోదు చేయబడ్డాయి.
ప్రశ్నపత్రాల రూపకల్పన నిబంధనలకు అనుగుణంగా:
- జాతీయ విద్యా పరిశోధనా సంస్థ, జాతీయ ఉపాధ్యాయ విద్యా సంస్థ రూపొందించిన సిలబస్ ఆధారంగా రాష్ట్రంలో అమలులో ఉన్న సిలబస్ అనుసరించడం జరిగింది.
- ముందుగా రూపొందించిన, అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సిలబస్ బ్లూ ప్రింట్, పరీక్షా విధానం, ప్రశ్నల సంఖ్య ప్రకారమే ప్రశ్నపత్రాల రూపకల్పన జరిగింది.
- ప్రశ్నల రూపకల్పనలో విషయ పరిజ్ఞానంతో పాటు, అనువర్తిత రూపంలో కాఠిన్యత స్థాయిని అనుసరించడం జరిగింది.
బహుళ సెషన్ల నిర్వహణ అవసరం:
- మెగా DSC-2025 పరీక్షలకు 3.36 లక్షల మంది అభ్యర్థులు 5.77 లక్షల దరఖాస్తులు సమర్పించారు.
- అందుబాటులో ఉన్న ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న పరీక్షా కేంద్రాల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని కొన్ని సబ్జెక్ట్స్ పరీక్షలను ఒకటి కన్నా ఎక్కువ షిఫ్టులలో నిర్వహించడం జరిగింది.
- మెగా DSC-2025 లో భాగంగా మొత్తం 69 కేటగిరీ పోస్టులకు పరీక్షలు నిర్వహించబడ్డాయి.
- అందులో 60 పోస్టులకు ఒకే సెషన్లో పరీక్షలు పూర్తవగా, 8 కేటగిరీలకు రెండు సెషన్లలో మరియు అధిక దరఖాస్తుల నేపథ్యంలో (1.6 లక్షల) కేవలం ఒక్క పోస్టుకు (SGT) మాత్రమే 10 సెషన్లలో పరీక్ష నిర్వహించడం జరిగింది.
నార్మలైజేషన్ ప్రక్రియ – శాస్త్రీయ విధానం:
- ఒకటి కంటే ఎక్కువ సెషన్లలో నిర్వహించిన పరీక్షలకే నార్మలైజేషన్ వర్తిస్తుంది.
- DSC-2025 G.O.Ms.No.15 & 16 (19.04.2025) లో ఇది తెలియజేయబడినది.
- బహుళ సెషన్లలో నిర్వహించిన పరీక్షలలో అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేయడం జరుగుతుంది.
- నార్మలైజేషన్ అనేది ఒక శాస్త్రీయ గణిత విధానాన్ని అనుసరించి ప్రతి అభ్యర్థికి సమాన ప్రమాణంలో మార్కులు పొందే అవకాశం కల్పించే ప్రక్రియ.
- ఇది నెగటివ్ మార్కింగ్ ఉన్న పరీక్షలకే వర్తిస్తుందని భావించడం సరికాదు. DSC-2018, Special DSC-2019, APTET - Aug 2022, Feb 2024, Oct 2024 ల్లోనూ నార్మలైజేషన్ ప్రక్రియ విజయవంతంగా అమలు చేయబడింది.
రెస్పాన్స్ షీట్లపై అపోహలకు తావులేదు:
- కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షపై అభ్యర్థుల అవగాహన మరియు సౌలభ్యం కోసం మెగా DSC-2025 ఆఫీసియల్ వెబ్సైట్ నందు మాక్ టెస్ట్ సౌకర్యాన్ని పరీక్షల కన్నా ముందుగానే అందుబాటులో ఉంచడం జరిగింది.
- CBT పరీక్షలో అభ్యర్థి స్వయంగా ఎంపిక చేసిన ఆప్షన్ మాత్రమే నమోదు అవుతుంది.
- కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షా విధానం (CBT) పై సరైన అవగాహన లేకపోవడం వల్ల, కొంతమంది అభ్యర్థులు సమాధానాలను ఎంపిక చేసిన తర్వాత 'సేవ్' చేయకపోవడం లేదా మార్చిన సమాధానాలను తిరిగి సేవ్ చేయకపోవడం వంటి లోపాలు చేయడం వలన, తాము ఇచ్చిన సమాధానం రిజిస్టర్ కాలేదని లేదా తప్పుగా నమోదయ్యాయని పొరపాటు పడుతున్నారు.
పరీక్షా కేంద్రాల భద్రత:
- పరీక్షా కేంద్రాల ఎంపికలో అన్ని ప్రమాణాలను కట్టుదిట్టంగా పాటించారు.
- ప్రైవేట్ సంస్థలు కేవలం కేంద్రాలుగా మాత్రమే పనిచేసాయి, పరీక్షల మరియు రెస్పాన్స్ షీట్ల నిర్వహణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించబడింది.
- సిస్టమ్ హ్యాంగ్ అయినచో పరీక్ష ఆగిన స్థానం నుండి కొనసాగే విధంగా విధానాలు అమలులో ఉన్నాయి. అభ్యర్థులకు పూర్తి 2.30 గంటల సమయం కల్పించబడింది.
- విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది.
- కొంతమంది సోషల్ మీడియా వేదికగా అసత్య వదంతులు వ్యాప్తి చేస్తూ అభ్యర్థులను ఆందోళనలకు గురి చేస్తూ అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు.
- ఇటువంటి దుష్ప్రచారాలను నమ్మవద్దని, అసత్య వదంతులు సృష్టించి వ్యాప్తి చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
కావున, అభ్యర్థులు ఎటువంటి అపోహలకూ గురి కావొద్దని తెలియజేయడమైనది.
Download School Education Press Note
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
0 comment