AP Mega DSC 2025 Certificates Verification Press Note - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

AP Mega DSC 2025 Certificates Verification Press Note

You might be interested in:

Sponsored Links

పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా DSC - 2025 సంబంధించి అన్ని సబ్జెక్టుల మెరిట్ జాబితాలను (స్టేట్, జోన్, డిస్ట్రిక్ట్ స్థాయి) 22.08.2025 నుండి మెగా DSC అధికారిక వెబ్సైట్ https://apdsc.apcfss.in లో అందుబాటులో ఉంచిన విషయం తెలిసినదే.

ఈ విషయంగా తెలియచేయడమేమనగా! వివిధ కేటగిరీ పోస్టులకుగాను Zone of Consideration లోకి వచ్చిన అభ్యర్ధులకు, వారు అప్లై చేసిన అన్ని రకాల పోస్టులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధిత జిల్లాల్లోనే గురువారం అనగా 28.8.2025 న ఉదయం 09.00AM నుండి ప్రారంభమవుతుంది.

కావున ఈ అభ్యర్థులు తమ వ్యక్తిగత Mega DSC- 2025 లాగిస్ ఐడీల ద్వారా 26.08.2025 మధ్యాహ్నం నుండి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్ధులు లాగిన్లోకి ప్రవేశించి కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుని అందులో సూచించిన సూచనలను ఖచ్చితంగా పాటించాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు అభ్యర్ధులు తీసుకురావలసిన సర్టిఫికెట్స్:

  • సంబంధిత విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికెట్లు
  • ఇటీవల జారీ చేసిన కుల ద్రువీకరణ పత్రం (వర్తించినచో)
  • అంగవైకల్యం ధ్రువీకరణ పత్రం (వర్తించినచో)
  • కాల్ లెటర్ నందు సూచించిన ఇతర సర్టిఫికెట్స్
  • గజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్లు జెరాక్స్ కాపీలు
  • 5 పాస్పోర్ట్ సైజు ఫొటోలు

అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయం మరియు వేదికకు తప్పనిసరిగా హాజరు కావాలి. హాజరు కాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది. అటువంటి సందర్భంలో తదుపరి మెరిట్ జాబితాలోని అభ్యర్థిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలవడం జరుగుతుంది.

ప్రభుత్వం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అభ్యర్ధులు నిర్దిష్ట సూచనలను పాటించి, సమయానికి సర్టిఫికెట్లతో హాజరు కావాల్సినదిగా తెలియచేయడమైనది.

గమనిక:

1. అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావడానికి ముందు, సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో వ్యక్తిగత Mega DSC-2025 లాగిన్ నందు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

2. కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరుకావడం వల్ల అభ్యర్థికి ఎటువంటి ఎంపిక హక్కు కలుగదు. ఎంపిక పూర్తిగా మెరిట్, అర్హత, రిజర్వేషన్ మరియు సంబంధిత నియమనిబంధనల ఆధారంగానే జరుగుతుంది.

AP Mega DSC 2025 Certificates Verification Press Note

Job Notifications Telegram Group

Job Notifications Whatsapp Group

Job Notifications YouTube Channel


0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE