You might be interested in:
పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు అనగా 22.08.2025న మెగా DSC- 2025 లోని అన్ని సబ్జెక్టుల (అనగా స్టేట్, జోస్, డిస్ట్రిక్ట్ స్థాయి) మెరిట్ జాబితాలను విడుదల చేసింది. ఈ మెరిట్ జాబితాలు మెగా DSC అధికారిక వెబ్సైట్ https://apdsc.apcfss.in/ లోనూ, అలాగే సంబంధిత జిల్లా విద్యాశాఖ వెబ్సైట్లలోనూ ఉంచబడ్డాయి. అభ్యర్థులు ఈ వెబ్సైట్లను సందర్శించి తమ ఫలితాలను చూడవచ్చు.
వివిధ కేటగిరీ పోస్టులకుగాను జోస్ ఆఫ్ కన్సిడరేషన్ లోకి వచ్చిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత మెగా DSC లాగిన్ ఐడీలు ద్వారా కాల్ లెటర్లు అందజేయబడతాయి. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ను డౌన్లోడ్ చేసుకుని అందులో పేర్కొన్న సూచనలను అనుసరించాలి.
కావున సదరు అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, గజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్లు సర్టిఫికెట్ల జెరాక్స్ కాపీలు, 5 పాస్ పోర్టు సైజు ఫోటోలతో సర్టిఫికెట్లు వెరిఫికేషనుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. వెరిఫికేషనుకు హాజరు కావడానికి మునుపే సంబంధిత సర్టిఫికేట్లను వెబ్సైట్లో అప్ లోడ్ చేసి రావాల్సి ఉంటుంది. నియామక ప్రక్రియ త్వరలో మొదలవుతాయి కాబట్టి అభ్యర్థులు ప్రతి సమాచారానికి వెబ్ సైట్ ను సందర్శించాలని కోరుతున్నాము.
అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయానికి సర్టిఫికేట్ వెరిఫికేషనుకు తప్పనిసరిగా హాజరు కావాలి. హాజరు కాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది. అటువంటి సందర్భంలో, తదుపరి మెరిట్లో ఉన్న అభ్యర్థిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలవడం జరుగుతుంది.
ప్రభుత్వం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా, న్యాయంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. అభ్యర్థులు నిర్దిష్టంగా అందించిన సూచనలను పాటించి, సమయానికి తగిన సర్టిఫికేట్లతో హాజరు కావలసి ఉంటుంది.
గమనిక: కేవలం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరుకావడం వల్ల అభ్యర్థికి ఎటువంటి ఎంపిక హక్కు కలుగదు. ఎంపిక పూర్తిగా మెరిట్, అర్హత మరియు సంబంధిత నియమనిబంధనల ఆధారంగా మాత్రమే జరుగుతుంది.
DSC మెరిట్ జాబితాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి పూర్తి వీడియో.. Click Here to Watch Videos
AP Mega DSC Updates WhatsApp Channel
0 comment