You might be interested in:
ఉపాధ్యాయులకు శుభోదయం,
2025-26 విద్యా సంవత్సరంలో మొదటి నిర్మాణాత్మక మదింపు SAMP-I పరీక్షలను ఈరోజు నుండి Assessment Booklets ఉపయోగించి జరపబోతున్నాం. ఇందుకోసంగా మనం ఈ క్రింది విషయాలను తప్పక పాటించవలసిన అవసరం ఉంది.
1. తరగతిలోని విద్యార్థులకు Assessment Booklets పంచే ముందుగా లోపలి పేజీలు ఏ తరగతికి ఏ సబ్జెక్టుకు చెందిగున్నవో పరిశీలించాలి.
2. విద్యార్థులందరూ మొదటి అసెస్మెంట్ కొరకై కేటాయించిన పేజీల యందే జవాబులు రాసేటట్టుగా సూచనలు చేయాలి.
3. తరగతిలోని విద్యార్థులందరి యొక్క Apaar ID లేక PEN సంఖ్యను Assessment Booklet పైన రాయాలి కాబట్టి, అందరు విద్యార్థులకు వారి PEN సంఖ్యను ముందుగా తెలియజేసి OMR నందు మొదటి గడిలో '0' ను మిగిలిన గడులలో PEN సంఖ్యను రాసి తదనుగుణంగా క్రింది బబుల్స్ ను పెన్సిల్ తో పూర్తిగా నింపాలి అని తెలియజేయవలెను.
4. రాయబోవు పరీక్షలోని సబ్జెక్ట్ కోడ్ను విద్యార్థులకు తెలియజేసి పూరింపచేయాలి.
5. విద్యార్థులు జవాబులు రాసే క్రమంలో ప్రశ్నపత్రంలోని ఏఏ ప్రశ్నలకు Assessment Booklet నందు ఏఏ ప్రదేశములలో జవాబులు రాయాలో వివరించాలి.
6. పరీక్ష అనంతరం, అందరి Assessment Booklets తీసుకొని, ఆ సబ్జెక్టును బోధిస్తున్న ఉపాధ్యాయునికి అందించాలి.
7. ఉపాధ్యాయుడు జవాబు పత్రాలను మూల్యాంకనము చేయడంతో పాటు, ప్రతి విద్యార్థికి మిగిలిన మూడు టూల్స్ (ఒక్కొక్కటి 5 మార్కులకు) ఫలితాలను కూడా OMR నందు పూరించాలి, కానీ OMR పై ఎటువంటి టిక్కు మార్కులు, సంతకము నమోదు చేయరాదు.
8. App నందు OMR ను స్కానింగ్ చేసి, అప్లోడ్ చేయాలి.
9. Individual మార్కుల జాబితా నందు కూడా ప్రతి ఉపాధ్యాయుడు అందరి విద్యార్థుల మార్కులను నమోదు చేసుకొన వలెను.
0 comment