You might be interested in:
ఏపీ లాసెట్, పీజీ లాసెట్, ఎడ్సెట్, పీఈసెట్ కింద ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్లకు ఉన్నత విద్యామండలి షెడ్యూల్ విడుదల చేసింది. వీటికి రెండు విడతల కౌన్సెలింగ్లు నిర్వహించనున్నట్లు పేర్కొంది. న్యాయ విద్యకు సంబంధించిన ఏపీ లాసెట్, పీజీ లాసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్ ఈ నెల 8 నుంచి ప్రారం భించనున్నట్లు ఉన్నత విద్యామండలి కార్యదర్శి టీవీ శ్రీకృష్ణమూర్తి శనివారం తెలిపారు. రిజిస్ట్రేషన్కు ఈ నెల 8-11 వరకు, ధ్రువపత్రాల పరిశీలనకు 9-12 వరకు, వెబ్ ఐచ్ఛికాల నమోదుకు 12-14 వరకు, ఐచ్చికాల మార్పునకు 15న అవకాశం కల్పించినట్లు చెప్పారు. 17న సీట్ల కేటాయింపు, 19న కళాశా లల్లో చేరేందుకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. బీఈడీలో ప్రవేశాలకు సంబంధించిన ఎడ్సెట్ కౌన్సెలింగ్ ఈ నెల 9 నుంచి ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్కు ఈ నెల 9-12 వరకు, ధ్రువపత్రాల పరిశీలనకు 10-13 వరకు, వెబ్ ఐచ్ఛికాల నమోదుకు 13-15 వరకు, ఐచ్ఛికాల మార్పునకు 16న అవ కాశం కల్పించారు. 18న సీట్ల కేటాయింపు, 19, 20 తేదీల్లో కళాశాలల్లో చేరేం దుకు అవకాశం ఇచ్చారు. • వ్యాయామ విద్య కోర్సులో ప్రవేశాలకు సంబం ధించిన పీఈసెట్ కౌన్సెలింగ్ ఈ నెల 10 నుంచి జరగనుంది. రిజిస్ట్రేషన్కు ఈ నెల 10-13 వరకు, ధ్రువపత్రాల పరిశీలనకు 11-14 వరకు, వెబ్ ఐచ్ఛికాల నమోదుకు 14-16 వరకు, ఐచ్చికాల మార్పునకు 17న అవకాశం ఇచ్చారు. 19న సీట్ల కేటాయింపు, 22, 23 తేదీల్లో కళాశాలల్లో చేరేందుకు అవకాశం కల్పించారు.
0 comment