ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటిస్‌షిప్ 2025: ఐటీఐ పాసైనవారు నవంబర్ 8 లోగా దరఖాస్తు చేసుకోండి - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

ఏపీఎస్ఆర్టీసీ అప్రెంటిస్‌షిప్ 2025: ఐటీఐ పాసైనవారు నవంబర్ 8 లోగా దరఖాస్తు చేసుకోండి

You might be interested in:

Sponsored Links

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నందు అప్రెంటిస్‌షిప్ చేయుటకు ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం. 

ముఖ్యమైన తేదీలు మరియు అర్హత

 * ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 25.10.2025

 * ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 08.11.2025

గమనిక: 08.11.2025 తర్వాత వచ్చిన దరఖాస్తులు ఎట్టి పరిస్థితులలోనూ పరిగణనలోకి తీసుకోబడవు.

ఐటీఐ ఉత్తీర్ణులైన ఈ క్రింద తెలిపిన జిల్లాల వారు మాత్రమే అర్హులు:

 * కర్నూల్

 * నంద్యాల

 * అనంతపురం

 * శ్రీ సత్య సాయి

 * కడప

 * అన్నమయ్య

దరఖాస్తు చేయు విధానము:

 * ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ఆసక్తిగల అభ్యర్థులు వారి పూర్తి వివరములను ఆన్‌లైన్ వెబ్‌సైట్ అడ్రస్ www.apprenticeshipindia.gov.in నందు దరఖాస్తు చేసుకోవాలి.

 * ఎస్టాబ్లిష్మెంట్ ఎంపిక: అభ్యర్థులు తాము చేయదలచుకున్న జిల్లాను ఎంచుకొని పోర్టల్ ద్వారానే అప్లై చేయాలి. ప్రతి జిల్లాకు సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ వివరాలు ఇక్కడ ఉన్నాయి:

   * కర్నూల్: APSRTC KURNOOL

   * నంద్యాల: APSRTC NANDYAL

   * అనంతపురము: APSRTC ANANTAPUR

   * శ్రీ సత్య సాయి: APSRTC SRI SATHYA SAI

   * కడప: APSRTC KADAPA

   * అన్నమయ్య: APSRTC ANNAMAYYA

ఆధార్ తప్పనిసరి (E-KYC): ఆన్‌లైన్ దరఖాస్తు నందు ఆధార్ కార్డును తప్పనిసరిగా నమోదు చేయవలెను (E-KYC). ఆధార్ కార్డు లోని వివరములు SSC సర్టిఫికేట్స్ లో ఉన్న వివరములతో సరిపోలాలి.

ఇతర మాధ్యమాలు స్వీకరించబడవు: ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడును.

ట్రేడ్ మరియు జిల్లా వారీగా ఖాళీల వివరములు (మొత్తం: 277)

  • కర్నూల్ -33
  • నంద్యాల -32 
  • అనంతపురము -37 
  • శ్రీ సత్య సాయి -25 
  • కడప -37 
  • అన్నమయ్య -33

సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు రుసుము

08.11.2025 వ తేదీ లోగా దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు మాత్రమే వెరిఫికేషన్ కొరకు హాజరు కావాలి.

 * వెరిఫికేషన్ స్థలం: జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల, ఏ.పి. యస్. ఆర్. టీ. సి., బళ్లారి చౌరస్తా, కర్నూల్.

 * రుసుము: వెరిఫికేషన్ కు హాజరయ్యే అభ్యర్థులు రూ.118/- (Rs.100+18 GST) రుసుము చెల్లించవలెను.

 * తేదీ: వెరిఫికేషన్ జరుగు తేదీ దినపత్రికల ద్వారా తెలియజేయబడును.

వెరిఫికేషన్ కు తీసుకురావలసిన పత్రములు (ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలు):

 * ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థి యొక్క ప్రొఫైల్

 * Apprenticeship Registration Number (ARN)

 * SSC మార్కుల లిస్టు

 * ITI మార్కులు (Consolidated Marks Memo)

 * NTC/NCVT సర్టిఫికేట్

 * కుల ధృవీకరణ పత్రము - SC/ST/BC (ఆరు నెలల లోపు జారీ చేయబడిన తాత్కాలిక కుల ధృవీకరణ పత్రము)

 * వికలాంగులైనచో ధృవీకరణ పత్రము

 * ఆధార్ కార్డు

📞 సందేహాల కొరకు సంప్రదించండి

 * పోర్టల్ నందు అప్లై చేయునపుడు ఏమైనా సందేహములు ఉంటే, మీరు మీ సమీప Govt. ITI కాలేజీ నందు సంప్రదించవచ్చును.

 * ఏదైనా సందేహమున్న యెడల phone no : 08518-257025 లకు ఆఫీస్ సమయములో మాత్రమే (ఉ: 10.30 గంటల నుండి సా: 05.00 గంటల వరకు) సంప్రదించవలసినదిగా కోరడమైనది.

నవంబర్ 8, 2025 లోగా దరఖాస్తు చేసుకోండి!

Download Notification

Official Website

Job Notifications Telegram Group

Job Notifications Whatsapp Group

Job Notifications YouTube Channel

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE