You might be interested in:
జనగణన-2027 నోటిఫికేషన్ జారీ వచ్చే నెలలో ముందస్తు సర్వే జనగణన 2027కు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
-ఇందుకు సంబంధించిన కసరత్తు వచ్చే నవంబరు నెల నుంచే ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ శుక్రవారం నాడు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ముందస్తు సర్వే ప్రక్రియ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన నమూనా ప్రాంతాల్లో గృహ జాబితా, గృహ గణనను కవర్ చేస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జనగణన -2027 తొలి దశ కోసం చేపట్టే ముందస్తు సర్వేను సులభతరం చేయడానికి 1948 జనాభా లెక్కల చట్టంలోని నిబంధనలను పొడిగిస్తూ కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ నోటిఫికేషన్ను జారీ చేసింది. దీని ప్రకారం 2027లో చేపట్టే చేపట్టే జనాభా లెక్కలకు వచ్చే నెల నవంబర్ 10 నుంచి 30 వరకు ముందస్తు సర్వే చేపట్టనున్నారు. నివాసితులకు నవంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు స్వీయ గణనకు అవకాశం కల్పించారు. ప్రధాన సర్వేకు ముందు వారు డిజిటల్ సమాచారాన్ని పొందుపర్చడానికి ఏర్పాట్లు చేశారు. 2027లో రెండు దశల్లో జనగణన చేపట్టనున్నారు. దీంతో పాటే కులగణన కూడా చేపట్టనున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
 
0 comment