ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి గారి చర్చలు వివరాలు - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి గారి చర్చలు వివరాలు

You might be interested in:

Sponsored Links

ముఖ్యమంత్రి గారితో జరిగిన చర్చల్లో...

* 2025 నవంబర్ 1 నుంచి 3.64% డిఎ ని అమలు చేస్తామని తెలియజేశారు.

* ** రిటైర్మెంట్ వరకు మహిళ ఉపాధ్యాయునిలు చైల్డ్ కేర్ లీవ్ ఉపయోగించుకోవచ్చని నిర్ణయం చేశారు.

**పోలీసు వారికి సరెండర్ లీవ్ వెంటనే మంజూరు చేస్తామన్నారు. టీచర్స్ కి తదుపరి ఆలోచిస్తామని తెలియజేశారు..



** ఆర్టీసీ వారికి  ప్రమోషన్స్ ఇస్తామని తెలిపారు.

** హెల్త్ కార్డులపై ఒక కమిటీని వేస్తామని తెలిపారు. 60 రోజుల్లో కమిటీ రిపోర్టును బట్టి హెల్త్ కార్డుల పై ఒక నిర్ణయాన్ని చేస్తామని తెలిపారు.

 **గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ని అఫీషియల్ కమిటీగా ఏర్పాటు చేస్తారు.

** 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపిఎస్, ఎంటిఎస్ మిగిలిన గవర్నమెంట్ ఉద్యోగులకు 60 నుంచి 62 సంవత్సరాల వయస్సు పెంపు, కారుణ్య నియామకాలు  తదుపరి  మినిస్ట్రీస్ గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ కమిటీతో చర్చించి నిర్ణయాలు చేసుకోవాలని తెలిపారు.

** వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆఫీస్ సబార్డినేట్స్ కి గౌరవపదమైన పదంతో ఒక నామిక్ లేచర్ ని మార్చే దానికి ప్రయత్నం చేస్తామని తెలియజేశారు.

** 12వ పిఆర్సి కమిటీ చైర్మన్ పై కూడా త్వరలో నిర్ణయం చేస్తామని తెలిపారు.

  12వ పి.ఆర్.సి చైర్మన్ నియమించకపోతే కింద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుందని అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి యుటిఎఫ్ పక్షాన తీసుకొని వెళ్ళాము.


**కనీసం మూడు డీఎ లు  ప్రకటించకపోయినా తీవ్ర అసంతృప్తి ఉంటుందని తెలిపాము.

 ** ఉమ్మడి సర్వీస్ రూల్స్ సమస్య తక్షణం పరిష్కరించాలని కోరాము.

----పి అర్ సి, డిఏ ల విషయంలో మన అసంతృప్తిని తెలియజేశాము.

యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE