Published : October 06, 2025
You might be interested in:
Sponsored Links
విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వరం ప్రకటించారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికీ పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు ఇచ్చేలా కొత్త పథకాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.ఎలాంటి పరిమితీ లేకుండా, అన్ని వర్గాలకు చెందిన ఎంతమంది విద్యార్థులైనా చదువుకునే వీలుండాలని సూచించారు. దేశంలో ఐఐటీ, ఐఐఎం, నిట్ వంటి సంస్థల్లో ఉన్నతవిద్య చదివేవారికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని స్పష్టం చేశారు. 4% వడ్డీకే బ్యాంకురుణాలు ఇవ్వడంతోపాటు, దానికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని తెలిపారు.
0 comment