Published : October 02, 2025
You might be interested in:
Sponsored Links
గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో తొలి ఐటి కంపెనీ ప్రారంభమైంది. 100 సిట్టింగ్ కెపాసిటీతో ప్రిన్స్టన్ ఐటీ సర్వీసెస్ సంస్థ కార్యకలాపాలను విజయదశమి రోజున ప్రారంభించింది. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఐటీ కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొని, సంస్థ ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మాట్లాడారు.
ప్రిన్స్టన్ ఐటీ సర్వీసెస్ విజయంపై... గుడివాడ సక్సెస్ ఆధారపడి ఉందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ ఐటీ సంస్థను తన సొంత కంపెనీగా భావించి.. విజయవంతానికి తన సంపూర్ణ సహకారం అందిస్తానన్నారు. పీ4 స్ఫూర్తితో ప్రిన్స్టన్ సీఈవో రవి తన స్వగ్రామంలో ఐటీ సంస్థ నెలకొల్పడం ఆదర్శప్రాయమని తెలిపారు. ఎమ్మెల్యే రాము సహకారంతో.. గుడివాడలో ఐటీ సంస్థ నెలకొల్పానని ప్రిన్స్ టన్ సీఈవో వెల్లడించారు. న్యూజెర్సీ, కెనడా, డొమినికాలతో పాటు హైదరాబాద్, కాకినాడలో ఈ సంస్థ పనిచేస్తుందని తెలిపారు.

0 comment