You might be interested in:
07-12-2025 న జరుగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు దరఖాస్తు చేసుకొనుటకు ఆన్లైన్ అప్లికేషన్ ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in నందు అందుబాటులో ఉంచడమైనది. ఈ పరీక్షకు నమోదు చేసుకొనుటకు చివరి అవకాశంగా 25-10-2025 వరకు పొడిగించడమైనది. తదుపరి ఎటువంటి పొడిగుంపు ఇవ్వబడదు, ఇదే చివరి అవకాశం. పరీక్ష రుసుము చెల్లించుటకు చివరి తేదీ 27-10-2025, ప్రింటెడ్ నామినల్ రోల్ మరియు ఒరిజినల్ SBI కలెక్ట్ రశీదును సంబంధిత జిల్లా విద్యా శాఖాధికారి వారి కార్యాలయంలో సమర్పించుటకు చివరి తేదీ 29-10-2025 మరియు విద్యాశాఖాధికారి వారి లాగిన్ లో అప్లికేషన్ ధృవీకరించుటకు చివరి తేదీ 31-10-2025. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లో 8 వ తరగతి చదువుచూ, 7వ తరగతి లో 55% మార్కులు (SC మరియు ST వారికి 50%) వచ్చి, కుటుంబ సంవత్సరాదాయం రూ.3,50,000/- లోపు ఉన్న విద్యార్థులు అందరూ కూడా ఈ పరీక్ష వ్రాయుటకు అర్హులే. నమోదు చేసే సమయంలో విద్యార్థి ఆధార్ కార్డ్ లో ఉన్న విధంగానే విద్యార్ధి పేరు, తండ్రి పేరు నమోదు చేయవలెను. దరఖాస్తు చేసుకొనుటకు ఎటువంటి ధృవపత్రాలు అవసరం లేదు గాని పరీక్ష వ్రాసే సమయమునకు అన్ని ధృవపత్రాలు ఖచ్చితంగా సిద్ధం చేసుకొనవలెను. పరీక్ష రుసుము ఓ.సీ, బి.సి విద్యార్ధులకు రూ. 100/- మరియు యస్.సి, యస్.టి విద్యార్ధులకు రూ. 50/-. పూర్తి వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు www.bse.ap.gov.in నందు గానీ లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో గాని తెలుసుకొనవలసినదిగా ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డా|| కె వి శ్రీనివాసులు రెడ్డి గారు తెలియజేసారు.
0 comment