Published : November 14, 2025
You might be interested in:
Sponsored Links
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) లో అప్రెంటిస్ షిప్ చేయాలనుకునే I.T.I. ఉత్తీర్ణులైన అభ్యర్థుల కోసం ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
APSRTC లో అప్రెంటిస్ షిప్ అవకాశం! I.T.I. పూర్తి చేసిన వారికి శుభవార్త!
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభం: 15-11-2025
- దరఖాస్తుకు చివరి తేదీ: 30-11-2025
- గమనిక: 30-11-2025 తర్వాత వచ్చిన దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోబడవు.
ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, మరియు పల్నాడు జిల్లాల నుండి I.T.I. కాలేజీలలో ఉత్తీర్ణులైన వారు మాత్రమే ఈ అప్రెంటిస్‌షిప్‌కు అర్హులు.
ట్రేడ్‌ల వారీగా ఖాళీల వివరాలు:
| TRADE | డీజిల్ మెకానిక్ | మోటర్ మెకానిక్ | ఎలక్ట్రిషియన్ | వెల్డర్ | పైంటర్ | మెషినిస్ట్ | ఫిట్టర్ | డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) | మొత్తము |
| కృష్ణా | 26 | 1 | 7 | 1 | 0 | 0 | 2 | 1 | 38 |
| NTR | 56 | 1 | 17 | 2 | 1 | 3 | 6 | 1 | 87 |
| గుంటూరు | 28 | 1 | 8 | 1 | 1 | 0 | 2 | 0 | 41 |
| బాపట్ల | 16 | 0 | 4 | 0 | 0 | 0 | 2 | 0 | 22 |
| పల్నాడు | 30 | 1 | 8 | 1 | 0 | 0 | 3 | 1 | 44 |
| ఏలూరు | 20 | 1 | 6 | 0 | 1 | 0 | 2 | 0 | 30 |
| పశ్చిమ గోదావరి | 20 | 1 | 6 | 1 | 0 | 0 | 1 | 0 | 29 |
దరఖాస్తు విధానం (ముఖ్య సూచనలు):
- దరఖాస్తు ప్రక్రియ www.apprenticeshipindia.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే చేయవలసి ఉంటుంది.
- రిజిస్ట్రేషన్: ముందుగా, అభ్యర్థులు Apprenticeship పోర్టల్ నందు 'Candidate Registration' ద్వారా రిజిస్టర్ అవ్వాలి.
ప్రొఫైల్ అప్‌డేట్:
- రిజిస్ట్రేషన్ తర్వాత, ప్రొఫైల్‌లో తప్పనిసరిగా ఆధార్ కార్డు (e-KYC) నమోదు చేయాలి.
- ఆధార్ కార్డులోని వివరాలు, SSC (10వ తరగతి) సర్టిఫికెట్లలోని వివరాలతో తప్పనిసరిగా సరిపోలాలి (పేరు, పుట్టిన తేదీ, తండ్రి/తల్లి పేరు మొదలైనవి).
- మీరు SSC మరియు ITI మార్కుల లిస్ట్, NCVT సర్టిఫికెట్ మొదలైన ముఖ్యమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
- ప్రొఫైల్ పూర్తిగా అప్‌డేట్ చేసిన తర్వాత, 'Apprentice Opportunities' పై క్లిక్ చేయాలి.
- Select Course Type: Designated
- Select Course: మీ ట్రేడ్ (ఉదా: Diesel Mechanic, Electrician)
- Search Locations: Andhra Pradesh
- Search by Establishment Name: మీ జిల్లాకు సంబంధించిన Establishment Name ను ఎంచుకోవాలి. ఉదాహరణకు, కృష్ణా జిల్లా వారైతే APSRTC KRISHNA.
- APPLY: వివరాలు సరిచూసుకొని, 'APPLY' బటన్ పై క్లిక్ చేయాలి.
సర్టిఫికెట్స్ వెరిఫికేషన్:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే వెరిఫికేషన్ కోసం హాజరు కావాలి.
- స్థలం: జోనల్ సిబ్బంది శిక్షణా కళాశాల, చెరువు సెంటర్, విద్యాధరపురం, విజయవాడ.
- తేదీలు: వెరిఫికేషన్ తేదీలు దిన పత్రికల ద్వారా గానీ లేదా APSRTC వెబ్‌సైట్ www.apsrtc.gov.in ద్వారా గానీ తెలియజేయబడతాయి.
- సమయం: ఉదయం 10:00 గంటలకు హాజరు కావాలి.
- ఫీజు: వెరిఫికేషన్ కోసం హాజరయ్యే అభ్యర్థులు ₹118/- (₹100 + ₹18 GST) ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
- వెరిఫికేషన్‌కు తీసుకురావలసినవి: ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక జత జిరాక్స్ కాపీలు, మరియు 2 పాస్ పోర్ట్ సైజు ఫోటోలు.
- Apprenticeship Registration నంబర్ తో కూడిన ప్రొఫైల్
- SSC మార్క్స్ లిస్ట్
- ITI మార్క్స్ లిస్ట్ (Consolidated Marks Memo)
- NCVT సర్టిఫికెట్
- కుల ధృవీకరణ పత్రము (SC/ST/BC - శాశ్వతమైనది, లేదా 6 నెలల లోపు జారీ చేయబడిన తాత్కాలికమైనది)
- ఆధార్ కార్డు
- PAN Card / Driving Licence
- సంబంధిత పత్రాలు (PH/Ex-servicemen/NCC/Sports.
ఈ సమాచారం మీ స్నేహితులకు లేదా అర్హులైన వారికి చేరవేయడానికి షేర్ చేయండి.

0 comment