You might be interested in:
2025-26 విద్యా సంవత్సరమునకు జరగనున్న జాతీయ ఉపకార వేతన పరీక్ష (NMMS)07-12-2025 ఉదయం 10:00 నుండి 1:00 గం|| వరకు జరుగును. ఈ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థినీ విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్సైట్ www.bse.ap.gov.in నందు పాఠశాల లాగిన్ లోనూ 2 WhatsApp-Mana Mitra అందుబాటులో ఉంచడమైనది. WhatsApp ద్వారా హాల్ టికెట్ లు డౌన్లోడ్ చేసుకునే విధానం కార్యాలయపు వెబ్సైట్ లో ఉంచడం జరిగినది. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాఠశాల U-DISE కోడ్ ను ఉపయోగించి లాగిన్ అయి తమ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల యొక్క హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసి విద్యార్థినీ విద్యార్థులకు అందజేయవలెను. సంబంధిత విద్యార్థినీ విద్యార్థుల వివరాలు ఏమైనా సవరింపులు ఉంటే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులచే ధృవీకరించబడు లేఖతో పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ ను కలిసి సెంటర్ నామినల్ రోల్ నందు తప్పకుండా నమోదు చేయించుకొనవలెను. హాల్ టికెట్ లో ఉన్న QR కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా విద్యార్థి యొక్క పరీక్ష కేంద్రమును తెలుసుకొనవచ్చును అని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల కార్యాలయ సంచాలకులు డా|| కె.వి. శ్రీనివాసులు రెడ్డి గారు తెలియజేశారు.
0 comment