You might be interested in:
ఉపాధ్యాయులు & ప్రధానోపాధ్యాయులకు అత్యంత ముఖ్య గమనిక
1 నుండి 5వ తరగతి విద్యార్థులు రాబోయే 75 రోజుల్లో తప్పనిసరిగా సాధించాల్సిన కనీస అభ్యాసన లక్ష్యాలు (Guaranteed Learning Outcomes) క్రింది విధంగా ఉన్నాయి
G-FLN లక్ష్యాలు – గ్రేడ్ 1 & 2
📚 1. భాషా సామర్థ్యాలు (Literacy Development )
Grade 1
🟩✔️ 3 అక్షరాల పదాలు కలిగిన చిన్న వాక్యాలను అర్థంతో చదవగలగాలి
🟩✔️ 2–3 అక్షరాల పదాలను స్వతంత్రంగా రాయగలగాలి
Grade 2
🟩✔️ 4–6 అక్షరాల పదాలతో ఉన్న చిన్న పేరాలను నిమిషానికి 30 పదాల వేగంతో చదవగలగాలి
🟩✔️ 3–4 అక్షరాల పదాలతో వాక్యాలను సరైన శైలిలో రాయగలగాలి
🔢 2. గణిత సామర్థ్యాలు (Numeracy)
Grade 1
🟩✔️ 1–20 సంఖ్యలను గుర్తించాలి, చదవాలి
🟩✔️ 1 అంకెల సరళ కూడికలు & తీసివేతలు చేయగలగాల
Grade 2
🟩✔️ 1–100 సంఖ్యలను సరైన శైలిలో గుర్తించాలి
🟩✔️ స్థాన మార్పిడితో 2 అంకెల కూడికలు & తీసివేతలు
G-FLN లక్ష్యాలు – గ్రేడ్ 3, 4 & 5
📚 1. భాషా సామర్థ్యాలు (Language Development)
Grade 3
🟩✔️ 5 అక్షరాల పదాలు & చిన్న పేరాలను 40 WCPM వేగంతో చదవాలి
🟩✔️ భావంతో, బిగ్గరగా, అర్థం చేసుకుంటూ చదవగలగాలి
🟩✔️ సరళ పదాలు & ఒక లైను వాక్యాలను రాయగలగాలి
Grade 4
🟩✔️ 5–7 అక్షరాల పదాలతో కథలను 45–50 WCPM వేగంతో చదవగలగాలి
🟩✔️ పాఠంలోని స్పష్టమైన & నిగూఢ (Inferential) అర్థాన్ని గ్రహించగలగాలి
🟩✔️ ఒకటి లేదా రెండు లైన్ల వాక్యాలను స్వతంత్రంగా రాయగలగాలి
Grade 5
🟩✔️ గ్రేడ్ స్థాయి పాఠ్యాన్ని 50+ WCPM, 90% అవగాహనతో చదవగలగాలి
🟩✔️ పేరాలను సంగ్రహించగలగాలి; ముఖ్య ఉద్దేశాన్ని గుర్తించగలగాలి
🟩✔️ సందర్భానుసారంగా అర్ధవంతమైన వాక్యాలను రాయగలగాలి
🔢 2. గణిత సామర్థ్యాలు (Numeracy)
Grade 3
🟩✔️ 999 వరకు సంఖ్యలను చదవడం/రాయడం
🟩✔️ స్థాన విలువలు, సరి/బేసి సంఖ్యలను గుర్తించడం
🟩✔️ 2 అంకెల కూడిక, తీసివేత, గుణకారం చేయగలగాలి
🟩✔️ 1-Step రాత లెక్కలు (Addition/Subtraction) చేయగలగాలి
Grade 4
🟩✔️ 3–4 అంకెల సంఖ్యలను చదవగలగాలి
🟩✔️ ముందు & తరువాత వచ్చే సంఖ్యలను గుర్తించగలగాలి
🟩✔️ స్థాన మార్పిడితో 3 అంకెల కూడికలు & తీసివేతలు
🟩✔️ 2 అంకెలను 1 అంకెతో గుణించగలగాలి
🟩✔️ గుణకార రాత లెక్కలను ఖచ్చితత్వంతో చేయగలగాలి
Grade 5
🟩✔️ 4 అంకెల సంఖ్యలను చదవడం, ముందు/తరువాత వచ్చే సంఖ్యలను గుర్తించడం
🟩✔️ 2 అంకెల గుణకారం & ప్రాథమిక భాగాహారం చేయగలగాలి
🟩✔️ 4 ప్రక్రియలను ఉపయోగించి 2-Step రాత లెక్కలు సాధించగలగాలి
ముఖ్య సూచన (IMPORTANT NOTE)
🟩✔️ పైవి కనీస సామర్థ్యాలు మాత్రమే
🟩✔️ సమ్మేటివ్ అసెస్మెంట్ నాటికి ప్రతి విద్యార్థి ఈ KPIs సాధించాలి
🟩✔️ ఈ సమాచారంను పోస్టర్/చార్ట్ రూపంలో తరగతి గదిలో ప్రదర్శించండి
🟩✔️ ప్రతి రోజు పిల్లల ప్రగతిని ఈ KPIs ప్రకారం నమోదు చేయండి.
0 comment