You might be interested in:
Andhra Pradesh Medical Services Recruitment Board (APMSRB) ద్వారా నోటిఫికేషన్ నెం. 01/2026 (తేదీ: 01-01-2026) విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME), ఆంధ్రప్రదేశ్ పరిధిలోని మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకం 2026 – 220 పోస్టులు | ఆన్‌లైన్ దరఖాస్తు
నియామక వివరాలు:
- సంస్థ:ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB)
- పోస్టు పేరు:అసిస్టెంట్ ప్రొఫెసర్
- నోటిఫికేషన్ నెం.:01/2026
- మొత్తం ఖాళీలు:220
- ఉద్యోగ స్థలం:ఆంధ్రప్రదేశ్
- దరఖాస్తు విధానం:ఆన్‌లైన్
- అధికారిక వెబ్‌సైట్:https://dme.ap.nic.in
ఖాళీల వివరాలు:
- అసిస్టెంట్ ప్రొఫెసర్ (క్లినికల్) – 130
- అసిస్టెంట్ ప్రొఫెసర్ (నాన్-క్లినికల్) – 16
- అసిస్టెంట్ ప్రొఫెసర్ (సూపర్ స్పెషాలిటీ) – 74
- ఇవి రెగ్యులర్ + బ్యాక్‌లాగ్ ఖాళీలు. అవసరాన్ని బట్టి సంఖ్య మారవచ్చు.
విద్యార్హతలు:
- క్లినికల్ / నాన్-క్లినికల్
- సంబంధిత స్పెషాలిటీలో MD / MS / DNB
- MCI / NMC గుర్తింపు పొందిన సంస్థల నుంచి ఉత్తీర్ణత
- సూపర్ స్పెషాలిటీ
- DM / MCh / DNB / DrNB
- గుర్తింపు పొందిన సంస్థల నుంచి పూర్తి చేసి ఉండాలి
అనుభవం (సీనియర్ రెసిడెన్సీ):
- క్లినికల్ & నాన్-క్లినికల్ పోస్టులకు 1 సంవత్సరం సీనియర్ రెసిడెన్సీ తప్పనిసరి
- సూపర్ స్పెషాలిటీకి సీనియర్ రెసిడెన్సీ అవసరం లేదు
- NMC గుర్తింపు లేని సంస్థల నుంచి DNB చేసినవారు అదనంగా 1 సంవత్సరం సీనియర్ రెసిడెన్సీ పూర్తి చేసి ఉండాలి
వయో పరిమితి (01-07-2025 నాటికి)
- కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
- వయో సడలింపు
- SC / ST / BC / EWS – 5 సంవత్సరాలు
- దివ్యాంగులు (PBD) – 10 సంవత్సరాలు
- ఎక్స్-సర్వీస్‌మెన్ – ప్రభుత్వ నిబంధనల ప్రకార
రిజర్వేషన్:
- వర్టికల్ రిజర్వేషన్: SC, ST, BC, EWS
- హారిజాంటల్ రిజర్వేషన్: మహిళలు, దివ్యాంగులు
- కేవలం ఆంధ్రప్రదేశ్ లోకల్ అభ్యర్థులకే అర్హత
జీతభత్యాలు:
- ₹68,900 – ₹2,05,500 (7వ UGC పే స్కేలు)
- సూపర్ స్పెషాలిటీ అలవెన్స్: ₹30,000 (అదనంగా)
ఎంపిక విధానం:
- ఎంపిక మెరిట్ + రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా ఉంటుంది
- మార్కుల విభజన (మొత్తం 100
- అర్హత పరీక్ష మార్కులు – 75
- అనుభవ వెయిటేజ్ – గరిష్టంగా 10
- కేంద్ర సంస్థల్లో చదివినవారికి – 5
- కాంట్రాక్ట్ / COVID / గ్రామీణ / గిరిజన సేవ వెయిటేజ్ – నిబంధనల ప్రకారం
దరఖాస్తు ఫీజు:
- OC – ₹2,000
- SC / ST / BC / EWS / దివ్యాంగులు – ₹1,500
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 08-01-2026
- చివరి తేదీ: 22-01-2026 (రాత్రి 11:59 వరకు)
దరఖాస్తు విధానం:
1. https://dme.ap.nic.in వెబ్‌సైట్‌కి వెళ్లండి
2. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోండి
3. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం పూరించండి
4. అవసరమైన సర్టిఫికేట్లు PDF రూపంలో అప్‌లోడ్ చేయండి
5. ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయండి
6. అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి
అప్‌లోడ్ చేయాల్సిన సర్టిఫికేట్లు (ముఖ్యమైనవి)
- SSC సర్టిఫికేట్ (DOB)
- 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు
- MBBS / PG / సూపర్ స్పెషాలిటీ సర్టిఫికేట్లు
- సీనియర్ రెసిడెన్సీ సర్టిఫికేట్
- AP మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్
- కుల / EWS / దివ్యాంగుల సర్టిఫికేట్లు (అవసరమైతే)
- కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్లు (వెయిటేజ్ కోసం)
ముఖ్య సూచనలు:
ఆన్‌లైన్ తప్ప ఇతర విధానాల్లో పంపిన దరఖాస్తులు తిరస్కరించబడతాయి
తప్పు / అసంపూర్తి వివరాలతో ఉన్న అప్లికేషన్లు అంగీకరించబడవు
అభ్యర్థులు తరచుగా APMSRB & DME వెబ్‌సైట్లు చెక్ చేయాలి
మెరిట్ లిస్ట్ చెల్లుబాటు: 1 సంవత్సరం
AP Assistant Professor Recruitment 2026 Telugu, APMSRB Notification 2026 Telugu, Assistant Professor Jobs AP, Medical College Jobs Andhra Pradesh

0 comment