Published : January 07, 2026
You might be interested in:
Sponsored Links
హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉద్యోగుల వయోపరి మితి 61 ఏండ్ల నుంచి 64 ఏండ్లకు పెంచడం లేదని మంత్రి శ్రీధర్ బాబు శాసనసభలో స్పష్టంచేశారు. సోమవారం జీరో అవర్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రడ్డి ఉద్యోగుల వయోపరిమితి గురించి పలువురు తమను ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. బయట ఏదో ప్రచారం జరిగితే ఆ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం ఏంటి? అని ప్రశ్నించారు. ఔటర్ రింగురోడ్డు, రీజినల్ రింగురోడ్డులో కాంగ్రెస్ నాయకుల భూములు ఉన్నాయనే అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రాకేశ్రడ్డి ఆరోపించగా, 20 ఏండ్ల కింద కొన్న వారికి భూములు ఉండొచ్చని శ్రీధరాబాబు దాటవేశారు.
0 comment