DSC Notification | డీఎస్సీ 2026 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ - Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India

Latest News

Latest G.O s

Program

home full ad 2

DSC Notification | డీఎస్సీ 2026 ఫిబ్రవరిలో నోటిఫికేషన్

You might be interested in:

Sponsored Links

డీఎస్సీ 2026 ఫిబ్రవరిలో నోటిఫికేషన్

▪️2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు 

▪️సిలబస్ కి ఇంగ్లీష్, కంప్యూటర్ సబ్జెక్టు 

▪️వివాదాస్పద జీవో 117 రద్దు చేసిన సర్కారు పరీక్షా విధానంలోనూ పలు మార్పులు 

▪️జనవరి 19న టెట్ ఫలితాల విడుదల

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ దఫా సుమారు 2500 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పాఠశాల విద్యాశాఖ జరిపిన తాజా సమీక్షలో మొత్తం ఖాళీలు 2500 వరకు ఉన్నట్టు తేల్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాణ్యత తగ్గకుండా ఉండాలంటే ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

▪️ విద్యారంగంలో సంస్కరణల్లో భాగంగా తొమ్మిది కొత్త విధానాలను అమలులోకి తీసుకొచ్చింది

ఈ కొత్త విధానం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 9200 ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రైమరీ తెచ్చింది 

ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ ముగిసిన తర్వాత క్షేత్రస్థాయిలో వాస్తవ ఖాళీలపై స్పష్టత వచ్చింది. బదిలీల అనంతరం సుమారు 1146 మంది ఉపాధ్యాయులు అదనంగా అవసరం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ స్థానాల్లో తాత్కాలి కంగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించారు. అయినా శాస్వత ప్రాతిపదికన డీఎస్సీ ద్వారా వీరిని భర్తీ చేయాలని మరో నోటిఫికేషన్ వేయనున్నారు.

▪️డీఎస్సీ  పరీక్ష విధానంలో మార్పులు

ఈసారి డీఎస్సీ రాసే అభ్యర్థులకు ఒక కొత్త సవాలు ఎదురుకానుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో ఉపాధ్యాయు లకు ఆంగ్లభాషా ప్రావీణ్యం, కంప్యూటర్ అవగాహనపై ఒక ప్రత్యేక పేపర్ను ప్రవేశ పెట్టాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. 

ఇప్పటి వరకు కేవలం సబ్జెక్ట్ నైపుణ్యాలకే పరి మితమైన డీఎస్సీ, ఇకపై ఏపీపీఎస్సీ తరహాలో అభ్యర్థుల బహుముఖ నైపుణ్యాలను పరీక్షించనుంది.

ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు ఆంగ్ల భాషలపై పట్టు సాధించేలా చేయాలంటే బోధించే ఉపాధ్యాయులకు ఆ నైపుణ్యం ఉండాలనేది ప్రభుత్వ ఆలోచన, అందుకే ఈ కొత్త పేపర్ ను డీఎస్సీలో అంతర్భాగం చేయనున్నారు. ఇది అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించనుంది. 

▪️టెట్ ఫలితాలపై ఉత్కంఠ

గత నెలలో నిర్వహించిన టెట్ లితాలను జనవరి 19న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలను కూడా పరిశీలిస్తున్నారు. అనంతరం ఫైనల్ కీ విడుదల చేస్తారు. తర్వాత ఫలితాలను రిలీజ్ చేస్తారు. డీఎస్సీకి టెట్ అర్హత ప్రాధాన్యత కలిగినది కావడంతో ఈ ఫలితాల కోసం లక్షల మంది ఎదురు చూస్తున్నారు.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE