You might be interested in:
రైల్వే గ్రూప్-D (Level-1) అభ్యర్థులకు అలర్ట్: భారీగా మారిన దరఖాస్తు తేదీలు - కొత్త షెడ్యూల్ ఇదే!
రైల్వేలో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. లెవల్-1 (గ్రూప్-D) పోస్టుల భర్తీకి సంబంధించి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ (CEN No. 09/2025) దరఖాస్తు తేదీలలో కీలక మార్పులు చేస్తూ తాజా Corrigendum జారీ చేసింది.
సుమారు 22,000 ఖాళీలతో రానున్న ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి మారిన తేదీలు, జీతం మరియు వయోపరిమితి వివరాలు మీకోసం ఈ క్రింద అందించబడ్డాయి.
RRB Group D Level-1 Recruitment 2026 Revised Dates |మారిన దరఖాస్తు తేదీలు - కొత్త షెడ్యూల్ ఇదే
ముఖ్యమైన మార్పులు - కొత్త తేదీలు (Revised Dates)
గతంలో ప్రకటించిన తేదీలకు బదులుగా, అభ్యర్థులు ఈ క్రింది కొత్త షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది:
వివరాలు - పాత తేదీ - కొత్త తేదీ (Revised):
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 21.01.2026 - 31.01.2026
- దరఖాస్తుకు చివరి తేదీ,: 20.02.2026 - 02.03.2026 (రాత్రి 11:59 వరకు)
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు (Key Highlights)
* మొత్తం ఖాళీలు: దేశవ్యాప్తంగా అన్ని RRBలలో కలిపి సుమారు 22,000 (సుమారుగా) పోస్టులు ఉన్నాయి.
* ప్రారంభ వేతనం: నెలకు రూ. 18,000/- (7వ CPC పే మ్యాట్రిక్స్ ప్రకారం లెవల్-1).
* వయోపరిమితి: 01.01.2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
అభ్యర్థులకు ముఖ్య గమనిక (Important Note)
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అభ్యర్థులను ఒక ముఖ్యమైన విషయంపై హెచ్చరించింది:
* నియామక ప్రక్రియ: రైల్వే ఉద్యోగాల ఎంపిక పూర్తిగా కంప్యూటరైజ్డ్ విధానంలో, కేవలం మెరిట్ (Merit) ప్రాతిపదికన మాత్రమే జరుగుతుంది.
* మోసగాళ్ల పట్ల జాగ్రత్త: ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించే మధ్యవర్తులు లేదా మోసగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని బోర్డు స్పష్టం చేసింది.
ఎలా దరఖాస్తు చేయాలి?
అభ్యర్థులు 31 జనవరి 2026 నుండి అధికారిక రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ వెబ్‌సైట్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
> చివరగా: తేదీలు మారినందున అభ్యర్థులకు ప్రిపరేషన్ కోసం మరికొంత సమయం దొరికినట్లయింది. కాబట్టి మీ ప్రిపరేషన్‌ను మరింత వేగవంతం చేయండి!
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel

0 comment