Published : March 06, 2026
You might be interested in:
Sponsored Links
పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 13 ఏళ్ల వయసులోపు ఉన్న వారికి రాబోయే 90 రోజుల్లో సోషల్ మీడియా అందుబాటులో లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతామన్నారు. 13 నుంచి 16 ఏళ్ల మధ్య వయసు వారికి సంబంధించి ఏం చేయాలనేదానిపై చర్చిస్తున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాతో మన పిల్లలు నష్ట పోవడానికి వీలు లేదన్నారు. అందుకోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుందని, బానిసైతే జీవితాలు నాశనమవుతాయన్నారు.


0 comment