Published : June 25, 2026
You might be interested in:
Sponsored Links
ఇంజినీరింగ్, వ్యవసాయ, పార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ కు సంబంధించిన ఫలితాలను ఈ నెల 20నవిడుదల చేసేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ ఒకటినే ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా.. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల కారణంగా జాప్యం చోటుచేసుకుంది. ఈఏపీసెట్లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ మార్కులకు ప్రాధాన్యం ఏర్పడింది. దాంతో సీబీఎస్ఈ 12వ తరగతి రీవెరిఫికేషన్, రీవా ల్యుయేషన్లలో మార్కులు పెరిగిన విద్యార్థులు డిక్ష రేషన్ ఫామ్ను ఈ నెల 27 సాయంత్రం 5 గంట లలోపు ఆన్లైన్లో సమర్పించాలని ఈఏపీ సెట్ కన్వీ నర్ సూచించారు. సీబీఎస్ఈ అభ్యర్థుల మార్కుల నమోదు పూర్తయిన తర్వాత ఫలితాలు ఇచ్చేందుకు రెండు రోజుల పాటు సమయం పడుతుంది.
0 comment