You might be interested in:
SSC JE 2026 Notification: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) శుభవార్త అందించింది. Junior Engineer Examination, 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో Junior Engineer పోస్టులతో పాటు IMDలో Scientific Assistant పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు.
మొత్తం ఖాళీలు
SSC JE 2026 ద్వారా 1,748 టెంటేటివ్ ఖాళీలు భర్తీ చేయనున్నారు. పోస్టులు Civil, Electrical, Mechanical, Telecom తదితర ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించినవి.
ముఖ్యమైన తేదీలు
📌 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 02 సెప్టెంబర్ 2026
📌 దరఖాస్తుకు చివరి తేదీ: 22 సెప్టెంబర్ 2026 రాత్రి 11:00 గంటల వరకు
📌 ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 23 సెప్టెంబర్ 2026 రాత్రి 11:00 గంటల వరకు
📌 Application Correction: 28 సెప్టెంబర్ – 30 సెప్టెంబర్ 2026
📌 Paper-I పరీక్ష: అక్టోబర్ / నవంబర్ 2026
📌 Paper-II పరీక్ష: డిసెంబర్ 2026
SSC JE 2026లో ప్రధానంగా ఈ పోస్టులు ఉన్నాయి:
Junior Engineer (Civil)
Junior Engineer (Electrical)
Junior Engineer (Mechanical)
Junior Engineer (Electrical & Mechanical)
Junior Engineer (Telecom)
Scientific Assistant – IMD
పోస్టును బట్టి విద్యార్హతలు, వయోపరిమితి మరియు అనుభవం మారుతాయి.
Civil, Electrical, Mechanical తదితర పోస్టులకు సంబంధిత Engineeringలో Degree లేదా Diploma అర్హతగా ఉంది. అయితే కొన్ని పోస్టులకు Diplomaతో పాటు సంబంధిత రంగంలో 2 సంవత్సరాల పని అనుభవం కూడా అవసరం.
అందువల్ల అభ్యర్థులు తాము దరఖాస్తు చేయాలనుకుంటున్న పోస్టుకు సంబంధించిన పూర్తి Essential Qualificationను తప్పనిసరిగా పరిశీలించాలి.
పోస్టును బట్టి గరిష్ఠ వయస్సు 30 సంవత్సరాలు లేదా 32 సంవత్సరాలు ఉంటుంది.
ఉదాహరణకు CPWD Junior Engineer పోస్టులకు గరిష్ఠ వయస్సు 32 సంవత్సరాలు కాగా, అనేక ఇతర JE పోస్టులకు 30 సంవత్సరాల వయోపరిమితి ఉంది.
రిజర్వేషన్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
అర్హత ఉన్న అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ₹100. మహిళలు, SC, ST, PwBD మరియు Ex-Servicemen అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ఫీజు మినహాయింపు ఉంటుంది.
SSC JE 2026లో Paper-I మరియు Paper-II అనే రెండు Computer Based Examinationలు ఉంటాయి.
General Intelligence & Reasoning
General Awareness
General Engineering
విభాగాలు ఉంటాయి.
Paper-I qualifying natureలో ఉంటుంది. Paper-Iలో సాధించిన normalized marks ఆధారంగా అభ్యర్థులను Paper-IIకి షార్ట్‌లిస్ట్ చేస్తారు.
Paper-IIలో అభ్యర్థి దరఖాస్తు చేసిన పోస్టుకు సంబంధించిన Engineering subjectను పరీక్షిస్తారు.
Engineering Subjects
🔹 JE Civil: General Engineering – Civil & Structural
🔹 JE Electrical: General Engineering – Electrical
🔹 JE Mechanical: General Engineering – Mechanical
🔹 Scientific Assistant – IMD: Computer Science & IT / Electronics & Telecommunication / Physics
🔹 JE Telecom: Telecommunication Engineering
Miniper-I మరియు Paper-IIకి కనీస అర్హత మార్కులు:
UR: 30%
OBC / EWS: 25%
ఇతర కేటగిరీలు: 20%
Paper-IIలో సాధించిన normalized marks మరియు అభ్యర్థి ఇచ్చిన post/organization preference ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
SSC JE Salary
SSC JE పోస్టులు Group-B, Level-6 Pay Matrixలో ఉంటాయి.
💰 Pay Scale: ₹35,400 – ₹1,12,400
ఇందుకు అదనంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తించే అలవెన్సులు లభిస్తాయి.
ముఖ్యమైన సూచన
SSC JEలో Post Preference చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఒకసారి ఇచ్చిన preferenceను తర్వాత మార్చుకునే అవకాశం లేదని నోటిఫికేషన్ స్పష్టం చేసింది. ఒక పోస్టును preferenceలో ఇవ్వకపోతే, మెరిట్ ఉన్నప్పటికీ ఆ పోస్టుకు పరిగణించరు.
అలాగే BRO Junior Engineer పోస్టులకు ప్రత్యేక Physical మరియు Medical Standards, Physical Efficiency Test వంటి నిబంధనలు ఉన్నాయి.
ముఖ్యంగా గుర్తుంచుకోండి
SSC JE 2026లో 1,748 టెంటేటివ్ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులు 02 సెప్టెంబర్ 2026 నుంచి ప్రారంభమై 22 సెప్టెంబర్ 2026తో ముగుస్తాయి. అర్హత ఉన్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించి దరఖాస్తు చేసుకోవడం మంచిది.
మరిన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్ష సమాచారం మరియు తాజా Updates కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి.
Job Notifications Telegram Group:
Job Notifications WhatsApp Channel:
Rajendra Jobs Telugu YouTube Channel:
0 comment