You might be interested in:
7545 ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని.. ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లలను చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఆర్టీసీలో ఉన్న ఖాళీలపై వివరాలను ప్రభుత్వానికి సమర్పించింది.
18 కేటగిరిల్లో 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. నియామక ప్రక్రియ త్వరలోనే ప్రారంభంకానుంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం అయింది కానీ... ఉద్యోగాలను భర్తీ చేయడంలో విఫలం అయిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటపై నిలబడి వివిధ విభాగాల్లో ఖాళీలను సకాలంలో భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
APRTCలో కేటగిరీల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఇవే..
➤ డ్రైవర్ పోస్టులు : 3,673
☛➤ కండక్టర్ పోస్టులు : 1,813
☛➤ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు : 656
☛➤ అసిస్టెంట్ మెకానిక్, శ్రామిక్ పోస్టులు : 579
☛➤ ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులు : 207
☛➤ మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులు: 179
☛➤ డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు : 280
0 comment