You might be interested in:
Sponsored Links
చేనేతలకు లబ్ధి కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం మరోనిర్ణయం తీసుకుంది. సంక్షేమ శాఖల వసతి గృహాలు, గురుకులాలు, ఎయి డెడ్, ప్రభుత్వ పరిధిలోని ఇతర సంస్థల్లో ఉన్న విద్యార్థులకు ఏకరూప దుస్తుల కోసం చేనేత కార్మికుల నుంచి సేకరించి అందించే వస్త్రం(లివరీ రకం) ధరలను 10 శాతం మేర పెంచింది. ఏటా ఈ మేరకు పెంచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బాలుర ప్యాంటుకు రూ.143.60, చొక్కాకు రూ.67.10, బాలికలకు సంబంధిం చిన వస్త్రాలకు రూ.78.70 చెల్లిస్తుండగా.. వాటిని వరుసగా రూ. 175.40, రూ.98,90, రూ.116.30కు పెంచింది. ఈ మేరకు ఆప్కోకు అనుమతిచ్చింది
0 comment