You might be interested in:
Sponsored Links
సైనిక్ పాఠశాలల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. అఖిల భారత సైనిక్ స్కూల్స్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన షెడ్యూల్ను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ప్రకటించింది. సైనిక పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలు నిర్వహిస్తారు. ఈ నెల 25 నుంచి జనవరి 13 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జనరల్, ఓబీసీ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు పరీక్ష రుసుం కింద రూ.800, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.650 చెల్లిం చాలి. ప్రవేశ పరీక్ష తేదీలను త్వరలో ప్రకటించను న్నట్లు ఎన్టీఏ పేర్కొంది. పెన్ను, పేపర్ (ఓఎ మ్మార్ షీట్) విధానంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. అన్ని బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు...
All India Sainik Schools Entrance Examination 2925 Notification
0 comment