You might be interested in:
ఏప్రిల్, మే నెలల్లో ఉపాధ్యాయుల బదిలీలు: ఇక పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు మాట్లాడు తూ.. ఫలితాల సాధన, హాజరు శాతం పెంపుదలకు ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు. బదిలీలు, ప్రమోషన్లు ఎలా ఉండాలనే అంశంపై సంఘాల అభిప్రాయం తీసుకున్నామని, వారి సూచనలతో బదిలీల కోసం ప్రత్యేక యాప్ రూపొందించినట్లు చెప్పారు. ఏప్రిల్, మే నెలల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తిచేస్తామన్నారు. అనం తరం.. ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పలు వినతులు వివరించారు. అవి..
• 20 ఏళ్లు సర్వీసు పూర్తిచేసిన సెకండరీ టీచర్ కేవలం స్కూల్ అసిస్టెంట్, హెచ్ఎం పదోన్నతి తోనే ఆగిపోతున్నారని, లెక్చరర్లు, డీవైఈఓ వం టి ప్రమోషన్లు కల్పించే అంశాన్ని పరిశీలించాలి..
• ఆకస్మిక తనిఖీల్లో ఉపాధ్యాయుల తొలి తప్పిదా నికే తీవ్రమైన చర్యలు అమలుచేస్తున్నారని, ఈ విషయంలో పట్టువిడుపుతో వ్యవహరించాలి.
• ప్రాథమిక స్థాయిలో తెలుగు మీడియం అమలుచేయాలి.. యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అమలుచేయాలి.
• అంతర్ జిల్లా బదిలీలకు అనుమతివ్వాలి.
0 comment