You might be interested in:
LIC Women Scheme : మహిళలకు కేంద్ర ప్రభుత్వ బీమా రంగ సంస్థ ఎల్ఐసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఉన్న చోటే ఉంటూ నెలవారీ స్టైఫండ్ సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. దేశంలోని విస్తృత మార్కెట్ లో అనేక పాలసీలు ప్రవేశపెడుతూ.. కోట్ల మంది ఖాతాదారులతో లాభాల బాటలో ఉన్న ఎల్ఐసీ.. కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని రూపొందించింది. దీనికి బీమా సఖీ యోజన అని కేంద్రం పేరు పెట్టింది. ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక తోడ్పాటుతో పాటు ఉపాధీ అవకాశాల్ని అందించేందుకు ప్రయత్నిస్తోంది
LIC Women Scheme : మహిళల కోసం ఎల్ఐసీ కొత్త స్కీమ్.. ఇంటి దగ్గరే ఉంటూ నెలకు రూ.7 వేలు సంపాదించే అవకాశం
పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ పని చేస్తూ ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం పదో తరగతి చదువుకున్న మహిళలు. వీరికి నెలవారీ స్టైఫండ్ అందిస్తూ.. ఉపాధీ మార్గాన్ని చూపిస్తుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరం. ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 09న ప్రారంభించారు. దీనికి ఎల్ఐసీ బీమా సఖి యోజన అనే పేరు పెట్టారు. ఈ పథకం ద్వారా వరుసగా మూడేళ్ల పాటు స్టైఫండ్ పొందవచ్చు. మరి ఈ బీమా సఖి యోజనకు దరఖాస్తు చేసుకోవడం ఎలాగో తెలుసా..
పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలకు ఎల్ఐసీ బీమా సఖి కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసుకుంటుంది. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్యనున్న వారు అర్హులు. వీరికి లైఫ్ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మూడేళ్ల పాటు సంస్థలో ఎల్ఐసీ ఏజెంట్లుగా శిక్షణ అందిస్తారు. ఈ సమయంలో వీరిని బీమా సఖీలుగా పిలుస్తుంటారు. ఈ శిక్షణ కాలంలోనే ప్రతీ నెల కొంత మొత్తాన్ని స్టైఫండ్ గా అందిస్తుంటారు. శిక్షణ అనంతరం మహిళలు వారున్న చోట్ల ఎల్ఐసీ తరఫున ఏజెంట్లుగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో.. మూడేళ్ల తర్వాత ఏజెంట్లకు లభిస్తున్నట్లే కమిషన్ ఇస్తారు. దీంతో.. వారికి ఉపాధీ మార్గం లభించినట్లవుతుంది అంటున్నారు.. ఎల్ఐసీ అధికారులు
ఎలా దరఖాస్తు చేయాలి.
⦿ బీమా సఖీ పథకం ద్వారా నెలవారీ స్టైఫండ్ పొందుతూ.. ఎల్ఐసీ ఏజెంట్ గా శిక్షణ పొందాలి అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి.
⦿ ఎల్ఐసీ అధికారిక వెబ్ సైట్ దర్శించాల్సి ఉంటుంది. అందులో https://licindia.in/web/guest/home వెళ్లాలి.
⦿ ఇందులో బీమా సఖీ అప్లికేషన్ క్లిక్ చేయాలి.
⦿ వేరే ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ వివరాల్ని పొందుపరచాల్సి ఉంటుంది. అంటే.. పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, చిరునామా వంటి వివరాల్ని అందించాలి.
⦿ మీ కుటుంబంలో ఎవరైనా ఎల్ఐసీ ఏజెంట్ గా పనిచేస్తున్నట్లైతే వారి వివరాల్ని అందించాల్సి ఉంటుంది.
అయితే.. ఈ పథకం ద్వారా ఎల్ఐసీ ఏజెంట్లుగా చేరిన వారిని సంస్థ శాలరీ ఉద్యోగులుగా పరిగణించదు. వీరిని మహిళ కెరీర్ ఏజెంట్లుగా పరిగణిస్తూ, ఆయా ప్రయోజనాల్ని మాత్రమే అందిస్తుంది.
బీమా సఖి యోజన పథకం ప్రయోజనాలు
ఎల్ఐసీ బీమా సఖి (MCA స్కీమ్) ద్వారా ఎంపికైన మహిళలకు మూడేళ్ల శిక్షణలో మొత్తం రూ.2 లక్షలకు పైగా లభిస్తుంది. ఇందులో మొదటి ఏడాది నెలకు రూ.7 వేల ప్రోత్సహం అందిస్తారు. ఆ తర్వాత రెండో ఏడాది నెలకు రూ.6 వేలు, మూడో ఏడాది రూ.5 వేల చొప్పున స్టైఫండ్ అందజేస్తుంటారు. ఇందులో బోనస్ కమీషన్లు ఉండవు. దీని కోసం మహిళలలు మొదటి ఏడాదిలో విక్రయించే పాలసీల్లో 65 శాతం పాలసీల్లు తర్వాతి ఏడాదికి యాక్టివ్‌గా ఉండాలి. అప్పుడే.. వారికి అన్ని ప్రయోజనాలు అందుతాయి.
0 comment