You might be interested in:
Rashtriya Chemicals and Fertilizers Limited Notification: భారత ప్రభుత్వ రంగానికి చెందిన ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్(RFCL) వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు...
మొత్తం ఖాళీల సంఖ్య: 378.
aకేటాయింపు: జనరల్-156, ఓబీసీ-101, ఈడబ్ల్యూఎస్-37, ఎస్సీ-56, ఎస్టీ-28.
1) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 182 ఖాళీలు
శిక్షణ వ్యవధి: 12 నెలలు.
విభాగాలవారీగా ఖాళీలు: అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్-51, సెక్రటేరియల్ అసిస్టెంట్-96, రిక్రూట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్(హెచ్‌ఆర్)-35.
అర్హతలు: అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 50 శాతం మార్కులతో బీకాం, బీబీఏ లేదా డిగ్రీ(ఎకనామిక్స్); సెక్రటేరియల్ అసిస్టెంట్, రిక్రూట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్(హెచ్‌ఆర్) పోస్టులకు 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీతోపాటు ఇంగ్లిష్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
2) టెక్నీషియన్ అప్రెంటిస్: 90 ఖాళీలు
శిక్షణ వ్యవధి: 12 నెలలు.
విభాగాలవారీగా ఖాళీలు: కెమికల్-20, సివిల్-14, కంప్యూటర్-06, ఎలక్ట్రికల్-10, ఇన్‌స్ట్రుమెంటేషన్-20, మెకానికల్-20.
అర్హత: సంబంధిత విభాగంలో 50 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
3) ట్రేడ్ అప్రెంటిస్: 106 ఖాళీలు
శిక్షణ వ్యవధి: కొన్ని విభాగాలకు 12 నెలలు, కొన్ని విభాగాలకు 24 నెలలు, కొన్ని విభాగాలకు 15 నెలల శిక్షణ ఉంటుంది.
విభాగాలవారీగా ఖాళీలు: అటెండెంట్ ఆపరేటర్ (కెమికల్ ప్లాంట్)-74, బాయిలర్ అటెండెంట్-03, ఎలక్ట్రీషియన్-04, హార్టికల్చర్ అసిస్టెంట్-06, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్(కెమికల్ ప్లాంట్)-03, ల్యాబొరేటరీ అసిస్టెంట్(కెమికల్ ప్లాంట్)-14, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ (పాథాలజీ)-02.
అర్హత: ట్రేడును అనుసరించి పదోతరగతి, ఇంటర్, బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.12.2024 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; 1984 అల్లర్ల బాధితులకు 5 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అభ్యర్థుల అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. తుది ఎంపికలో ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 శాతం మినహాయింపు వర్తిస్తుంది.
స్టైపెండ్: నెలకు రూ.7000 నుంచి రూ.9000.
శిక్షణ ప్రదేశాలు: ట్రాంబే (ముంబయి), థాల్ (రాయ్‌గఢ్ జిల్లా).
అభ్యర్థులు రిపోర్టింగ్ సమయంలో సమర్పించాల్సిన డాక్యుమెంట్లు..
➥ తాజాగా దిగిన పాస్‌పోర్ట్ సైజు ఫోటో
➥ పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఒరిజినల్ సర్టిఫికేట్
➥ అన్ని విద్యార్హతల ఒరిజినల్ సర్టిఫికేట్లు
➥ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్
➥ కుల ధ్రువీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికేట్) - ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే.
➥ ఓబీసీ (నాన్ క్రీమిలేయర్) - బీసీ అభ్యర్థులకు
➥ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ - ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు
ముఖ్యమైన తేదీలు...
➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 10.12.2024.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 24.12.2024.
Download Complete Notifications
0 comment