You might be interested in:
NIACL Assistant Posts Recruitment: న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్( NIACL) సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 500
విద్యార్హత: డిగ్రీ
ముఖ్యమైన తేదీలు:
సరైన అర్హతలున్న వారు డిసెంబరు 17 నుంచి 2025 జనవరి 1 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
దరఖాస్తు ఫీజు:
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ద్వారా ఉద్యోగాల ఎంపిక చేపడతారు.
జీతం:
ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.40,000 వరకు జీతంగా చెల్లిస్తారు. ఉద్యోగాలకు సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ డిసెంబరు 17 నుంచి అందుబాటులో ఉండనుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం:ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలో సాధించిన అర్హత మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పరీక్ష విధానం: ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి, ప్రిలిమ్స్లో కనీసం కట్ ఆఫ్ మార్కులు సాధించిన వారిని మాత్రమే మెయిన్స్కు పిలుస్తారు.
➥ ప్రిలిమ్స్ పరీక్ష: పరీక్ష ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది, అసిస్టెంట్ ప్రిలిమ్స్ పరీక్షను 3 విభాగాలుగా నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ విభాగాల మీద ప్రశ్నలు అడుగుతారు. వ్యవధి: 60 నిమిషాలు(1 గంట). మొత్తం100 ప్రశ్నలకు గాను 100 గరిష్ట మార్కులు. ప్రతి విభాగానికి 20 నిమిషాలు కెటాయించారు. ప్రతి ప్రశ్నకు 1 మార్కు ఉంటుంది మరియు ప్రశ్న వెయిటేజీలో ¼ తప్పు సమాధానానికి పెనాల్టీ ఉంటుంది.
➥ మెయిన్స్ పరీక్ష: పరీక్ష ఆబ్జెక్టివ్ మరియు డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్, టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్, టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ మీద ప్రశ్నలు అడుగుతారు. మొత్తం200 ప్రశ్నలకు గాను 250 గరిష్ట మార్కులు. ప్రతి ప్రశ్నకు 1.25 మార్కు ఉంటుంది మరియు ప్రశ్న వెయిటేజీలో ¼ తప్పు సమాధానానికి పెనాల్టీ ఉంటుంది.
వేతనం: ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.40,000 జీతంగా చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు..
➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.02.2024.
➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 15.02.2024.
0 comment