You might be interested in:
ఏకీకృత పింఛన్ ను నోటిఫై చేసిన కేంద్రం:
డిల్లీ: పదవీ విరమణకు ముందు 12 నెలల్లో సగటు మూలవేతనం ఎంత ఉందో దానిలో 50 శాతాన్ని పింఛనుగా ఖాయంగా పొందేందుకు వీలు కల్పించే 'ఏకీకృత పింఛన్ పథకం' (యూని ఫైడ్ పెన్షన్ స్కీం-యూపీఎస్)పై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ వెలువరిం చింది. జాతీయ పింఛన్ వ్యవస్థ (నేషనల్ పెన్షన్ సిస్టం-ఎన్పీఎస్) కింద ఉంటూ, కనీసం 25 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకుని యూపీఎస్ను ఎంచుకున్న
కేంద్ర ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ఉద్యోగానికి రాజీనామా చేసినవారికి, ఉద్వాసనకు గురైనవా రికి, సర్వీసు నుంచి తొలగించినవారికి మాత్రం యూపీఎస్ వర్తించదు. 2004 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన NPS లో ఉండాలా UPS లోనా అనేది ఎంచుకునే అభిమతాన్ని 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లు నోటిఫికేషన్ పేర్కొంది.
UPS ను ఈ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
తీసుకురానున్నారు. పింఛన్ పొందడానికి కావా ల్సినంత సర్వీసు కాకుండా తక్కువ ఉంటే నైష్పత్తికంగా చెల్లిస్తారు. కనీసం పదేళ్ల సర్వీసు ఉంటే నెలకు రూ.10,000 పింఛన్ లభిస్తుంది. పింఛన్ పొందే అర్హత ఉన్న 25 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకుని స్వచ్ఛంద పదవీ విరమణ తీసు కున్నవారికి.. వారి అసలైన పదవీవిరమణ తేదీ నుంచి 'ఖాయమైన పింఛన్ వస్తుందని నోటిఫి కేషన్ తెలిపింది. పదవీ విరమణ తర్వాత చని పోతే ఆ తేదీనాటికి వారికి ఉన్న పింఛన్లో 60 శాతాన్ని జీవితభాగస్వామికి ఇస్తారు.
0 comment