Cement Corporation of India Limited jobs: డిగ్రీ అర్హతతో సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు జీతం నెలకు 40000 - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

Cement Corporation of India Limited jobs: డిగ్రీ అర్హతతో సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగాలు జీతం నెలకు 40000

You might be interested in:

Sponsored Links

భారత ప్రభుత్వం , ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్  మినిస్ట్రీ పరిదిలో గల మినిరత్న కంపెనీ అయినటువంటి బ్రాడ్ కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ , రాజ్బన్ సిమెంట్ ఫ్యాక్టరీ (హిమాచల్ ప్రదేశ్) సంస్థ కార్యాలయంలో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా బర్నర్ , ఫిట్టర్ , ఎలక్ట్రీషియన్ , ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అను ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ: బ్రాడ్ కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

బర్నర్ – 01

ఫిట్టర్ – 02 

ఎలక్ట్రీషియన్ – 01

ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ – 01 అనే ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విద్యార్హత:

1. బర్నర్ : కెమిస్ట్రీ సబ్జెక్టు గా కలిగిన బి. ఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత లేదా కెమికల్ ఇంజనీరింగ్ / సిమెంట్ టెక్నాలజీ లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి వుండాలి.

సిమెంట్ ఇండస్ట్రీ లో  ఒక సంవత్సరం పనిచేసిన అనుభవం అవసరం అగును.

2. ఫిట్టర్ : ఐటిఐ ( ఫిట్టర్ ) ఉత్తీర్ణత

3. ఎలక్ట్రీషియన్ : ఐటిఐ ( ఎలక్ట్రీషియన్ ) ఉత్తీర్ణత 

4. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ : ఐటిఐ (ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఉత్తీర్ణత ) 

వయస్సు:

బర్నర్ ఉద్యోగాలకు 40 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఫిట్టర్ ,  ఎలక్ట్రీషియన్ ,  ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నిండి యుండి 35 సంవత్సరాలలోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం:

అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అప్లికేషన్ తో పాటు గా క్రింద పేర్కొన్న కాపీలు కూడా ఆఫ్లైన్ విధానం ద్వారా పంపించాలి.

అవసరమగు పత్రాలు: 

విద్యార్హత ధృవ పత్రాలు

SSC లేదా బర్త్ సర్టిఫికెట్

కుల ధృవీకరణ పత్రం

పని అనుభవం వున్న వారు వర్క్ ఎక్సపీరియన్స్ దృవీకరణ పత్రం

పాన్ కార్డు

ఆధార్ కార్డు

పేర్కొన్న ధృవ పత్రాలు సెల్ఫ్ అటెస్టెడ్ చేసి , దరఖాస్తు తో జత చేసి ఆఫీస్ వారి చిరునామా కి పంపించాలి.

దరఖాస్తు పంపవలసిన చిరునామా: Broadcast Engineering Consultants India Limited (BECIL), BECIL BHAWAN, C-56/A-17, Sector-62, Noida-201307 (U.P).

అప్లికేషన్ ఫీజు:  

జనరల్ /  ఓబీసీ/ ఎక్స్ – సర్వీస్ మాన్ / మహిళలు – 590/- రూపాయలు.

ఎస్సీ , ఎస్టీ, PwBD, EWS అభ్యర్థులు 295/- రూపాయలు దరఖాస్తు ఫీజు ను ఆఫ్లైన్ విధానం ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో “Broadcast Engineering Consultants India Ltd, Noida”  పేరు మీదుగా చెల్లించాలి.

జీతం

బర్నర్ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి నెలకు 40,000/- రూపాయల జీతం లభిస్తుంది.

ఫిట్టర్ , ఎలక్ట్రీషియన్ , ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఉద్యోగాలు కు  ఎంపిక కాబడిన వారికి  12,360/- రూపాయల జీతం లభిస్తుంది.

ముఖ్యమైన తేదిలు: Offline విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 08/01/2025


 Online Application Link

Download Complete Notification

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE