You might be interested in:
అప్రెంటీస్ చట్టం - 1961 క్రింద సదరన్ రీజియన్లో 200 మంది అప్రెంటీస్లు నియమించడానికి నోటిఫికేషన్
దేశం కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా, ఇండియన్ ఆయిల్, మార్కెటింగ్ విభాగం, సదరన్ రీజియన్ వారు తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని తమ లొకేషన్లలో 2024-25 సంవ త్సరం కోసం 200 మంది ట్రేడ్ అప్రెంటీస్లు (ట్రేడ్ అప్రెంటీస్ - ITI / టెక్నీషియన్ అప్రెంటిస్- డిప్లొమా/ట్రేడ్ అప్రెంటీస్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్) నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వయోపరిమితి అర్హతా ప్రమాణాలు, విద్యార్హత, స్టైపెండ్ వివరాలు, సడలింపులు, తగ్గింపులు, రిజర్వేషన్లు లాంటి వివరాలతో కూడిన ఈ ప్రకటన పూర్తి పాఠం మా కార్పొరేషన్ వెబ్సైట్లో https://www.iocl.com/apprenticeships లో జనవరి 17, 2025న 10:00 గం. నుండి అందుబాటులోకి వస్తుంది.
ఏవిధంగా దరఖాస్తు చేయాలి: పేర్కొన్న అర్హతా ప్రమాణాలు కలిగిన ఆసక్తి కలిగిన
అభ్యర్థులు మరియు NATS (డిప్లొమా మరియు గ్రాడ్యుయేట్లు)/NAPS (ITI కోసం) అప్రెంటిసిఫ్ పోర్టల్లో నమోదు చేసుకున్నవారు NAPS/NATS పోర్టల్ ద్వారా ఆన్లైన్లో 17 జనవరి 2025 ఉదయం 10:00 గం. నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ 16 ఫిబ్రవరి 2025 23:55 గంటల వరకు అందుబాటులో ఉంటుంది
ఈ ప్రకటనకు సంబంధించిన ఏదైనా తదుపరి నోటిఫికేషన్ /సవరణ లాంటిది www.iocl.com లో మాత్రమే ప్రచురించబడుతుంది.
గమనిక: అప్రెంటిస్లకు రెగ్యులర్ ఉపాధి కల్పించే బాధ్యత కార్పొరేషన్ మీద ఉండదు. ఈ అప్రెంటీస్ షిప్ ఆధారంగా, ఏ సమయంలోనైనా సరే, కార్పొరేషన్ నుండి రెగ్యులర్ ఉద్యోగం కోసం క్లెయిమ్ చేసే హక్కు అప్రెంటీస్లకు ఉండదు. ఈ అప్రెంటీసీఫ్ ఆధారంగా అప్రెంటీస్కు ఉద్యోగం ఇవ్వాల్సిన బాధ్యత IOCL మీద ఉండదు.
0 comment