You might be interested in:
32,438 పోస్టుల భర్తీ.. చివరి తేదీ ఫిబ్రవరి 22
జనవరి 23: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఆర్‌ఆర్‌బీ) ప్రకటించిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ గురువారం మొదలయింది.
సెంట్రల్ పే కమిషన్‌లో పేర్కొన్న లెవల్ 1 నుంచి లెవల్ 7 వరకు మొత్తం 32,438 పోస్టులు భర్తీ చేయనుంది. ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కేవలం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఫిబ్రవరి 22. దరఖాస్తులో ఏవైనా సవరణలు చేయాలనుకుంటే అందుకు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 వరకు అవకాశం కల్పించింది.
ఫీజును ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ పురుష అభ్యర్థులు రూ.500 ఫీజుగా చెల్లించాలి. బ్యాంకు రుసుములు మినహాయించిన తరువాత అందులో రూ.400 వరకు ఆర్‌ఆర్‌బీ వాపసు చేస్తుంది. మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులు, మాజీ సైనికులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల వారు రూ.250 ఫీజు చెల్లించాలి. బ్యాంకు చార్జీలు మినహాయించుకున్న అనంతరం దాన్ని కూడా వాపసు చేస్తుంది. 2025 జనవరి ఒకటో తేదీ నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉన్నవారే ఈ ఉద్యోగాలకు అర్హులు.
RRB Group D Posts 32438 Posts | రైల్వే శాఖలో 32438 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల
0 comment