You might be interested in:
SSC GD Constable Admit Card 2025 : ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ అడ్మిట్ కార్డ్ 2025 విడుదలకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (GD) పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష తేదీలను ఎస్‌ఎస్‌సీ (SSC) ఇప్పటికే వెల్లడించింది. ఈ మేరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు (CRPF) అధికారిక ప్రకటన విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం కానిస్టేబుల్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు ఫిబ్రవరి 4, 5, 6, 7, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరుగున్నాయి. అడ్మిట్‌కార్డ్ విడుదలయ్యాక ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in/ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వివిధ కేంద్ర సాయుధ బలగాల్లో మొత్తం 39,481 కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ (గ్రౌండ్ డ్యూటీ) పోస్టులు భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ విధానంలో ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే కాకుండా తెలుగుతో సహా మొత్తం 13 ప్రాంతీయ భాషల్లో ఉంటుంది. రాతపరీక్ష అనంతరం ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా SSC GD పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు
0 comment