You might be interested in:
రాష్ట్రంలో ఉన్న పలు కోర్టుల్లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ప్రకటన విడుదల చేసింది.
వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లు కావలసినవారు వాట్సప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరండి:
Job Notifications Whatsapp Group:
https://chat.whatsapp.com/K3c69y7kyjeJvQ6sf46Wgo
Job Notifications Telegram Group:
మొత్తం1,673 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో 1277 టెక్నికల్ ఉద్యోగాలు ఉండగా.. మరో 184 నాన్-టెక్నికల్ కోటాలో ఉన్నాయి. ఇక తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ కింద మరో 212 పోస్టులను కూడా రిక్రూట్ చేయనున్నారు.
ఈ పోస్టులకు సంబంధించిన్ ఆన్ లైన్ దరఖాస్తులు జనవరి 8, 2025వ తేదీతో ప్రారంభం కానున్నాయి. జనవరి 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ లో రాత పరీక్షలు జరుగుతాయి. మరికొన్ని పోస్టులకు జూన్ లో ఎగ్జామ్స్ ఉంటాయి. https://tshc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలను పార్టీ ఏ, పార్టీ బీలుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలన్నీ కూడా శాశ్వత ప్రాతిపాదికన భర్తీ చేయనున్నారు. రాత పరీక్షలతో పాటు స్కిల్స్ టెస్ట్ ఆధారంగా తుది జాబితాలను ప్రకటిస్తారు. అయితే పోస్టుల వివరాలతో కూడిన నోటిఫికేషన్లు హైకోర్టు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. ఇందులో ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు.
ముఖ్య వివరాలు:
ఉద్యోగ ప్రకటన - తెలంగాణ హైకోర్టు
మొత్తం ఖాళీలు - 1673
విభాగాలు - టెక్నికల్ -1277, నాన్ టెక్నికల్ - 184, తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీసెస్-212 ఖాళీలు
పోస్టులను అనుసరించి అర్హతలు ఉంటాయి. కొన్ని పోస్టులకు టెన్త్ అర్హతతోనే దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటేరియస్ వంటి పోస్టులకు లా డిగ్రీతో పాటు పని అనుభవం కూడా ఉండాలి.
ఆన్ లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం - 8 జనవరి 2025.
దరఖాస్తులకు చివరి తేదీ - 31 జనవరి 2025
రాత పరీక్షలు - ఏప్రిల్, జూన్ 2025
ఎంపిక విధానం - రాత పరీక్షలు, స్కిల్ టెస్ట్, ధ్రువపత్రాల ఆధారంగా తుది జాబితా ఉంటుంది.
అధికారిక వెబ్ సైట్ - https://tshc.gov.in/showChildDocTypes?id=95
0 comment