You might be interested in:
Jio AirFiber: కేబుల్ టీవీ కోసం ఎక్స్‌ట్రాగా బిల్లు చెల్లించకూడదని అనుకుంటున్నారా అయితే మీకోసమే జియో ఇప్పుడు నెలకి జస్ట్ రూ.599కే అదిరిపోయే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తోంది.
ఈ ప్లాన్‌లో మీకు హై-స్పీడ్ ఇంటర్నెట్, ఏకంగా 12 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి యాక్సెస్, ఇంకా 800లకు పైగా లైవ్ టీవీ ఛానళ్లు కూడా వస్తాయి. మీ ఇంటికి సరసమైన ధరలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే, ఈ జియో ఎయిర్‌ఫైబర్ ప్లాన్ చాలా మంచి ఆప్షన్.
* రూ.599 ఎయిర్‌ఫైబర్ ప్లాన్‌లో ఏమేం వస్తాయంటే..
ఇది జియో ఎయిర్‌ఫైబర్‌లో చాలా తక్కువ ధర ప్లాన్, ఇది 30 రోజుల పాటు పనిచేస్తుంది. కావాలంటే 6 నెలలు లేదా 12 నెలల ప్లాన్ కూడా తీసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో మీకు ఏమేం లభిస్తాయంటే ముందుగా 30 Mbps వరకు స్పీడ్‌తో ఇంటర్నెట్ వస్తుంది. దీంతో బ్రౌజింగ్, స్ట్రీమింగ్, గేమింగ్ అన్నీ స్మూత్‌గా చేసుకోవచ్చు.
నెలకి 1000GB (1TB) డేటా ఇస్తారు. డేటా అయిపోతుందనే టెన్షన్ ఉండదు. 12 పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి ఫ్రీ యాక్సెస్ వస్తుంది. వాటిలో డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లివ్ (Sony Liv), జీ5 (ZEE5), జియో సినిమా, సన్ నెక్స్ట్ (Sun NXT), హోయిచోయి (Hoichoi), డిస్కవరీ+ (Discovery+), ఆల్ట్‌బాలాజీ (ALTBalaji) ఉన్నాయి.
ఈరోస్ నౌ (Eros Now), లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play), షెమరూమీ (ShemarooMe), డాక్యుబే (DocuBay), ఎపిక్ఆన్ (EPIC ON) వంటి ఇతర ఓటీటీలు కూడా ఇదే ప్లాన్‌లో ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. అంతేకాదు, 800 కంటే ఎక్కువ టీవీ ఛానెళ్లు వస్తాయి. అందులో న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ ఇంకా చాలా రకాల ఛానెళ్లు ఉంటాయి.
టీవీలో మీకు కావాల్సిన ప్రోగ్రామ్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. టీవీ ఛానెళ్లు ఈజీగా చూడటానికి జియో వాళ్లే ఫ్రీగా సెటప్ బాక్స్ ఇస్తారు. ఇది కేబుల్ టీవీ సెటప్ బాక్స్ లాగానే పని చేస్తుంది. కాబట్టి ఇది ఉపయోగించడం కూడా చాలా ఈజీ. టీవీ బిల్లు ఆదా చేసుకోవచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్ డివైజ్‌ల విషయంలో ఎక్కువ గజిబిజి లేకుండా చూసుకోవచ్చు.
ఇన్‌స్టాలేషన్, వ్యాలిడిటీ ఆప్షన్లు:
జియో ఈ ప్లాన్‌ను తీసుకోవడానికి వేర్వేరు పేమెంట్ ఆప్షన్లు ఇస్తోంది. 3 నెలల ప్లాన్ తీసుకుంటే ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు రూ.1,000 ఉంటాయి. 6 నెలల ప్లాన్ కోసం 6 నెలలకు కలిపి మొత్తం డబ్బులు కట్టాలి. ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు రూ.500 మాత్రమే.12 నెలలకు కలిపి పేమెంట్ చేస్తే, ఇన్‌స్టాలేషన్ పూర్తిగా ఫ్రీ.
ఇంకా 12 నెలల ప్లాన్ తీసుకుంటే, ఒక నెల సర్వీస్ ఫ్రీగా ఇస్తారు. అంటే 12 నెలల డబ్బులతో 13 నెలలు వాడుకోవచ్చు. ఈ ప్లాన్ తీసుకుంటే ఒక ఏడాదంతా ఎలాంటి బిల్లుల భారం లేకుండా ఉండొచ్చు. అంతరాయం లేని వినోదాన్ని అందుకోవచ్చు. జియో సిగ్నల్ బాగా ఉన్నచోట ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
* జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ ఎలా తీసుకోవాలి
మీరు ఈ ప్లాన్ తీసుకోవాలనుకుంటే, ఈ కింద ఇచ్చిన వాటిలో ఏదో ఒకటి చేయొచ్చు. 60008-60008 నెంబర్‌కి మిస్డ్ కాల్ ఇవ్వాలి. జియో వాళ్లే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. జియో అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్లి ఆన్‌లైన్‌లో అప్లై చేస్తే. సింపుల్‌గా అయిపోతుంది. దగ్గరలో ఉన్న జియో స్టోర్‌కి వెళ్లాలి. అక్కడ స్టాఫ్ హెల్ప్ చేస్తారు.
0 comment