You might be interested in:
Anganwadi Jobs: నిరుద్యోగ యువతకి ప్రభుత్వం మరోసారి భారీ గుడ్ న్యూస్ అందించింది. ఎందుకంటే ఒకే సారి భారీ సంఖ్యలో ఉద్యోగాల ఖాళీలను తెలిపింది. నోటిఫికేషన్ ఇచ్చేందుకు మార్గం క్లియర్ చేసింది.
మరి, ఆ పోస్టులు ఏంటో వివరంగా తెలుసుకుందాం.
తెలంగాణలో గత సంవత్సరం కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. అలా ఏర్పాటు అయ్యిందో లేదో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగాలను క్లియర్ చేసే పని పెట్టుకుంది. అందులో కొన్ని పోస్టులకు పరీక్షలు పెట్టి చాలా మంది తెలంగాణ యువతకి ఉద్యోగాలు కల్పించింది. అందులో భాగంగానే మరో ఉద్యోగ కల్పన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం.
తెలంగాణ రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖలో భారీ ఉద్యోగాల జాతరకి రంగం సిద్ధమైంది. ఏకంగా 14,236 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం నుంచి సమాచారం. ఇందులో 6,399 అంగన్వాడీ టీచర్స్, 7,837 హెల్పర్స్ పోస్టులు ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇంకా ఏమైనా ఉద్యోగాలు ఉన్నాయా అనేది ప్రభుత్వం నుంచి పూర్తి స్పష్టత రానుంది.
రాష్ట్ర మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ మేరకు ఫైల్ పై సంతకం చేసింది. అయితే.. రాష్ట్రంలో దాదాపు 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటికి కింద మినీ అంగన్‌వాడీలు 39 వందలకి పైగా ఉన్నాయి. ఈ మినీని పూర్తి స్థాయి అంగన్వాడీ కేంద్రాలుగా చేశారు. దాంతో రాష్ట్రంలో ఇప్పుడు ఈ పోస్టులు అవసరం అయ్యాయి.
ముఖ్యంగా గత పదేళ్లలో ఉద్యోగాలు రాక చాలా మంది ఇబ్బంది పడ్డారు. కానీ కొత్త సర్కార్ ఇచ్చిన ఉద్యోగాల్లో పోటీ ఎక్కువ ఉండడంతో చాలా మందికి నిరాశే ఎదురైంది. అలాంటి వారికి ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే మళ్లి ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి. ఎలా అని ఆలోచిస్తున్న చాలా మంది నిరుద్యోగులకి ఇది భారీ ఊరట.
0 comment