You might be interested in:
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ నుంచి ఇంటర్న్ షిప్ ప్రకటన జారీ అయింది. సమ్మర్ అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఎక్స్ పోజర్ (SURE) ప్రోగ్రామ్ కింద 250 మందికి అవకాశం కల్పించనున్నారు. అర్హులైన వారు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్య వివరాలు:
ఇంటర్న్ షిప్ ప్రకటన - ఐఐటీ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం
మొత్తం ఖాళీలు - 200 (ఇందులో 100 మందిని మహిళా అభ్యర్థులన ఎంపిక చేస్తారు)
ఎంపికైన వారికి నెలకు రూ. 15 వేల స్టైఫండ్ చెల్లిస్తారు.
కోర్సు వ్యవధి - ఒకటి నుంచి రెండు నెలలు ఉంటుంది. (మే 15 నుంచి జూన్ 15, 2025)
ఐఐటీ హైదరాబాద్ స్టూడెంట్స్ కాకుండా ఇతర విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఎమ్మెస్సీ మ్యాథ్య్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదివే విద్యార్థులు లేదా ఎంఏ ఆర్ట్స్, బీటెక్ లేదా ఇంటిగ్రేటెడ్ బీటెక్ చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులను పరిశీలించి… ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. అకడమిక్ మార్కులతో పాటు పలు పరీక్షల్లో వచ్చిన మార్కులను ప్రమాణికంగా తీసుకుంటారు.
ఎంపికైన వారిని క్యాంపస్ లో హాస్టల్ వసతి ఉంటుంది. మెస్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం - ఆన్ లైన్
అప్లికేషన్లకు చివరి తేదీ - 5 మార్చి 2025
ఫలితాల ప్రకటన - 10 మార్చి 2025.
ప్రోగ్రామ్స్ కోర్సు ప్రారంభం - 15 మే 2025
0 comment