You might be interested in:
పార్లమెంటులో గురువారం ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను కొత్త బిల్లు, పరిమాణం పరంగా ప్రస్తుత చట్టంతో పోలిస్తే తక్కువే ఉంది. 1961 నాటి ఆదాయపు పన్ను చట్టంతో పోలిస్తే సగానికి సగం తగ్గింది. అదే సమయంలో వివాదాలకు ఆస్కారం తగ్గుతుందని 'తరచూ అడిగే ప్రశ్నల(ఎఫ్ ఏక్యూ) రూపం'లో ఆదాయ పన్ను విభాగం వివ రించింది. ముఖ్యాంశాలు..
L
** కొత్త బిల్లులో 2.6 లక్షల పదాలున్నాయి. ప్రస్తుత ఐటీ చట్టంలో 5.12 లక్షల పదాలున్నాయి.
** చాప్టర్ల సంఖ్య 47 నుంచి 23కు; సెక్షన్ల సంఖ్య 819 నుంచి 236కు, పేజీల సంఖ్య 823 నుంచి 622కు పరి మితమయ్యాయి.
ప్రస్తుత చట్టంతో పోలిస్తే కొత్త బిల్లులో పట్టికల సంఖ్య 18 నుంచి 57కు పెరిగింది. ప్రస్తుత చట్టంలోని 1200 నిబంధనలు (ప్రొవిసోస్), 900 వివరణల (ఎక పనే షన్స్)ను తొలగించారు.
** మినహాయింపులకు సంబంధించిన నిబంధనలు, టీడీఎస్/టీసీఎస్ వివరాలను సంక్షిప్తంగా, పట్టికల రూపంలో ఇచ్చారు. లాభాపేక్ష లేని సంస్థలకు సంబంధించిన చాప్ట ర్ ను సరళమైన భాషలోకి మార్చారు.
* కోర్టులు తమ ఆదేశాల్లో పేర్కొనే కీలక పదాలను మాత్రం పెద్దగా మార్చలేదు.
విధానపరంగా ఎటువంటి మార్పులూ చేయలేదు. కేవలం మెటీరియల్' మార్పులు మాత్రమే చేపట్టారు.
రిటర్ను ఫైలింగ్
వేతనాలకు సంబంధించిన అన్ని నిబంధనలనూ ఒక దగ్గ రకు చేర్చారు. దీంతో పన్ను చెల్లింపుదార్లకు రిటర్నుల ఫైలింగ్ సమయంలో వేర్వేరు చాప్టర్లను పరిశీలించాల్సిన అవసరం తప్పింది. గ్రాట్యుటీ, లీవ్ ఎన్ క్యాష్మెంట్, పెన్షన్ కమ్యుటే షన్, వీఆర్ఎస్ కాంపెన్సేషన్ తదితరాలను వేతన చాప్టర్లో భాగం చేశారు. ఫైలింగ్ సమయంలో గందరగోళానికి గురి చేసే 'క్రితం సంవత్సరం' (ప్రీవియస్ ఇయర్), 'మదింపు సంవ త్సరం' (అసెస్మెంట్ ఇయర్)లను కొత్త బిల్లులో తొలగించి, పన్ను ఏడాది మాత్రమే ఉంచారు.
'80సీ'ని క్లాజ్ 123కి మార్చారు:
పన్ను చెల్లింపుదార్లందరికీ సెక్షన్ 80సీ సుపరిచితమే. ఈ సెక్షన్ కిందకు ఈఎల్ఎస్ ఎస్ పెట్టుబడులు, పీపీఎఫ్, బీమా ప్రీమియాలు, ఎన్పీఎస్ డిపాజిట్లు తదితరాలు వస్తాయి. 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తోంది. కొత్త బిల్లులో దీనిని సెక్షన్/క్లాజ్ 123 కిందకు తీసుకొచ్చారు.
0 comment