You might be interested in:
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) తాజాగా 234 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (JEO) పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంధన రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ అయిన హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగ అవకాశాలు రావడం అనేది అభ్యర్థులకు చాలా మంచి అవకాశం. ఈ పోస్టులకు అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, వయో పరిమితి, ఎంపిక విధానం, పరీక్షా సరళి, అప్లికేషన్ ఫీజు వంటి ముఖ్యమైన వివరాలను ఈ వ్యాసంలో వివరంగా పరిశీలిద్దాం.
విభాగాల వారీగా ఖాళీలు:
హెచ్‌పీసీఎల్‌లో 234 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. వాటిల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్) 130, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్) 65, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్‌స్ట్రుమెంటేషన్) 37 , జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కెమికల్) 2 ఖాళీలు ఉన్నాయి. ఈ మొత్తం ఖాళీల్లో అన్‌రిజర్వుడ్‌కు 96, ఈడబ్ల్యూఎస్‌లకు 23, ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు 63, ఎస్సీలకు 35, ఎస్టీలకు 17 పోస్టులు కేటాయించారు.
విద్యార్హతలు:
మెకానికల్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ / కెమికల్ ఇంజనీరింగ్ / కెమికల్ టెక్నాలజీ ఇంజనీరింగ్ విభాగాలలో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. UR/ OBCNC/ EWS అభ్యర్థులు 60% మార్కులు మరియు SC/ ST/ PWD అభ్యర్థులు 50% మార్కులు సాధించి ఉండాలి.
వయో పరిమితి:
14.02.2025 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ ST/ PWD/ OBC అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
UR/ OBC/ EWS అభ్యర్థులు: రూ. 1,180
SC/ ST/ PWD అభ్యర్థులు: ఫీజు లేదు
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
గ్రూప్ టాస్క్ / గ్రూప్ డిస్కషన్
స్కిల్ టెస్ట్
పర్సనల్ ఇంటర్వ్యూ
జీతభత్యాలు:
ప్రొబేషన్ వ్యవధి: ఒక సంవత్సరం
పే స్కేల్: రూ. 30,000 నుండి రూ. 1,20,000 వరకు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభ తేదీ: జనవరి 15, 2025
దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 14, 2025
అధికారిక వెబ్‌సైట్: https://www.hindustanpetroleum.com/careers ను సందర్శించండి. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవండి.
0 comment