You might be interested in:
జాబ్ సాధించాలంటే పెద్ద పెద్ద డిగ్రీలు ఉండాలని అనుకుంటారు. కానీ మనం చదివింది పదో తరగతే అయినా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీ టెన్త్ సర్టిఫికేట్ ఎంతో ఉపయోగపడనుంది
తాజాగా టెన్త్ అర్హతతో జాబ్స్ కోసం చూస్తున్న వారికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) గుడ్ న్యూస్ చెప్పింది. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకునే అవకాశాన్ని మీకు కల్పించింది.
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
CISFలో 1,161 కానిస్టేబుల్ ట్రేడ్స్‌మన్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా కానిస్టేబుల్ కుక్, టైలర్, బార్బర్, స్వీపర్, పెయింటర్, గార్డనర్ మొదలైన పోస్టులను భర్తీచేయనున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నవారు ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఏప్రిల్ 3వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి తెలుసుకుందాం.
పోస్టు-ఖాళీలు
1. కానిస్టేబుల్/కుక్ (Conistable/Cook) - 493
2. కానిస్టేబుల్/కాబ్లర్ (Conistable/Cobler) - 09
3. కానిస్టేబుల్/టైలర్ (Conistable/Tailor) - 23
4. కానిస్టేబుల్/బార్బర్ (Conistable/Barber) - 199
5. కానిస్టేబుల్/వాషర్‌మెన్ (Conistable/Washermen) - 262
6. కానిస్టేబుల్/స్వీపర్ (Conistable/Sweeper) - 152
7. కానిస్టేబుల్/పెయింటర్ (Conistable/Painter) - 02
8. కానిస్టేబుల్/ కార్పెంటర్ (Conistable/Carpenter) - 09
9. కానిస్టేబుల్/ఎలక్ట్రీషియన్ (Conistable/Electrician) - 04
10. కానిస్టేబుల్/మెయిల్ (Conistable/Mail) - 04
11. కానిస్టేబుల్/వెల్డర్ (Conistable/Welder) - 01
12. కానిస్టేబుల్/చార్జ్ మెకానిక్ (Conistable/Charge Mechanic) - 01
13. కానిస్టేబుల్/ఎంపీ అటెండెంట్ (Conistable/MP Attendant) - 02
మొత్తం పోస్టుల సంఖ్య - 1161
అర్హత: SSC లేదా తత్సమాన విద్యార్హతలతో పాటుతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి (Age Limit) - 01-08-2025 నాటికి 18 - 23 ఏళ్లు నిండి ఉండాలి.
జీతం: నెలకు రూ.21,700 - రూ.69,100.
శారీరక ప్రమాణాలు: ఎత్తు (Height) కనీసం 165 సెం.మీ., ఛాతీ 78-83 సెం.మీ. ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష (OMR/ CBT), డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ (Application Process): ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు (Application Fee): రూ.100. (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05/03/2025.
ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 03/04/2025.
0 comment