You might be interested in:
Money Earning: వృద్ధాప్యంలో ఎలాంటి ఇబ్బందులు రావద్దంటే, సంపాదించే రోజుల్లోనే రిటైర్‌మెంట్ సేవింగ్స్ ప్లాన్స్‌లో పెట్టుబడి పెట్టాలి. ఇవి లాంగ్ టర్మ్‌లో బెస్ట్ రిటర్న్ అందిస్తాయి.
ఇందుకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్ ఓ బెస్ట్ ఆప్షన్. ఇది సురక్షితంగా ఉంటుంది, స్థిరమైన రాబడి అందిస్తుంది. అంతేకాకుండా పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. భారతదేశంలోని చాలా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. పీపీఎఫ్ ప్రయోజనాలు, పనితీరు గురించి తెలుసుకుందాం.
పీపీఎఫ్ రిటర్న్స్‌కి ప్రభుత్వ గ్యారెంటీ ఉంటుంది. ప్రస్తుతం 7.1% వడ్డీ రేటును అందిస్తోంది. ఈ వడ్డీ రేటు కాంపౌండింగ్ పవర్ కారణంగా కాలక్రమేణా మీ సేవింగ్స్‌ని వేగంగా పెంచుతుంది. వాస్తవానికి PPF మెచ్యూరిటీ పీరియడ్ 15 సంవత్సరాలు, కానీ 5 సంవత్సరాల బ్లాక్‌లలో టెన్యూర్ పొడిగించవచ్చు. ప్రతి సంవత్సరం రూ.500 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
* ట్యాక్స్ బెనిఫిట్స్
పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టే డబ్బుకు పాత పన్ను విధానంలో ఎలాంటి పన్ను ఉండదు. మెచ్యూరిటీ తర్వాత అందుకునే మొత్తం కూడా పన్ను రహితంగా ఉంటుంది. ట్యాక్స్ సేవ్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
* పీపీఎఫ్ నుంచి ఎంత సంపాదించవచ్చు?
ప్రతి సంవత్సరం మ్యాగ్జిమం రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాల్లో రూ.40 లక్షల ఫండ్ క్రియేట్ అవుతుంది. 25 సంవత్సరాల పాటు పెట్టుబడిని కొనసాగిస్తే, సేవింగ్స్ దాదాపు రూ.1 కోటి వరకు పెరుగుతాయి.
* రూ.1,000, రూ.5,000, రూ. 10,000 నెలవారీ పెట్టుబడులకు రాబడి ఎలా ఉంటుందంటే..
- నెలకు రూ.1,000
వార్షిక పెట్టుబడి: రూ.12,000
15 సంవత్సరాల్లో మొత్తం పెట్టుబడి: రూ.1,80,000
వడ్డీ: రూ.1,45,457
మెచ్యూరిటీ మొత్తం: రూ.3,25,457
- నెలకు రూ.5,000
పెట్టుబడి: రూ.60,000
15 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి: రూ.9,00,000
వడ్డీ: రూ.7,27,284
మెచ్యూరిటీ మొత్తం: రూ.16,27,284
- నెలకు రూ.10,000
పెట్టుబడి: రూ.1,20,000
15 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి: రూ.18,00,000
వడ్డీ: రూ.14,54,567
మెచ్యూరిటీ మొత్తం: రూ.32,54,567
అదే ప్రతి సంవత్సరం మ్యాగ్జిమం రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాలలో రూ.40.68 లక్షల ఫండ్ క్రియేట్ అవుతుంది. ఈ మొత్తంలో రూ.22.5 లక్షలు పెట్టుబడి పెట్టిన డబ్బు కాగా, రూ.18.18 లక్షలు సంపాదించిన వడ్డీ.
* వడ్డీ రేటు, లెక్కింపు
PPF వడ్డీ రేటును ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో రివ్యూ చేస్తుంది. అంటే ఇది రెగ్యులర్‌గా మారవచ్చు. ప్రస్తుతం 2025 జనవరి నుంచి మార్చి వరకు ఉన్న త్రైమాసికానికి 7.1% వడ్డీ చెల్లిస్తుంది. ప్రతి నెలా 5వ తేదీ తర్వాత అకౌంట్‌లోని లోయెస్ట్ బ్యాలెన్స్‌పై వడ్డీ లెక్కిస్తారు. ఇది ఏటా కాంపౌండ్ అవుతుంది. ఆర్థిక సంవత్సరం చివరిలో అకౌంట్‌లోకి యాడ్ అవుతుంది.
* పీపీఎఫ్ అకౌంట్ ఎక్కడ తెరవాలి?
బ్యాంకులు లేదా పోస్టాఫీసులలో పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. నియమాలు లేదా ప్రయోజనాలలో తేడా ఉండదు. కాబట్టి సౌలభ్యం ఉన్న చోట అకౌంట్ తెరవవచ్చు. సమీపంలో బ్యాంక్ ఉంటే, సులభంగా ఆన్‌లైన్ యాక్సెస్ కావాలనుకుంటే, బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేయడం మంచిది. గ్రామీణ ప్రాంతంలో నివసిస్తుంటే లేదా ప్రశాంతమైన ప్రదేశాన్ని ఇష్టపడితే, పోస్టాఫీసుకు వెళ్లడం మంచిది.
0 comment