You might be interested in:
ఇందులో భాగంగా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్) ద్వారా మొత్తం 18,174 ఖాళీలను భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఫైనల్ చేసింది.
అభ్యర్థులు ssc.gov.in వెబ్‌సైట్ ద్వారా పోస్టుల వారీగా వేకెన్సీలను చెక్ చేసుకోవచ్చు. గతంలో కంటే.. ఈ సారి ఎక్కువ పోస్టులను భర్తీ చేయనున్నారు. గతంలో 17,727 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా... ఈ సారి మాత్రం 18,174 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
Job Notifications YouTube Channel
ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా అదనపు విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెండంచెల (టైర్-1,టైర్-2) పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
తొలి దశలో టెర్-1 పరీక్ష 100 ప్రశ్నలు-200 మార్కులకు జరుగుతుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్(25 ప్రశ్నలు), జనరల్ అవేర్‌నెస్(25 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్(25 ప్రశ్నలు), ఇంగ్లిష్ కాంప్రహెన్షన్(25 ప్రశ్నలు) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయిస్తారు. పరీక్ష సమయం 1గంట.
టైర్-1లో నిర్దిష్ట కటాఫ్ మార్కులు సాధించి.. మెరిట్ జాబితాలో నిలిచిన వారికి తదుపరి దశలో టైర్-2 పరీక్ష నిర్వహిస్తారు. టైర్-2 పరీక్ష మొత్తం నాలుగు పేపర్లలో జరుగుతుంది.
పేపర్-1: పేపర్-1ను సెషన్-1, సెషన్-2లుగా నిర్వహిస్తారు. అదే విధంగా ప్రతి సెషన్‌ను రెండు సెక్షన్‌లుగా పేర్కొన్నారు. సెషన్-1(సెక్షన్-1)లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్(మాడ్యూల్-1), రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్(మాడ్యూల్-2) విభాగాల నుంచి 30 ప్రశ్నలు చొప్పున మొత్తం 60 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున 180 మార్కులు ఉంటాయి.
సెషన్-1 సెక్షన్-2లో.. మాడ్యూల్-1 పేరుతో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్‌లో 45 ప్రశ్నలు, మాడ్యూల్-2 పేరిట జనరల్ అవేర్‌నెస్ విభాగాల్లో 25 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 70 ప్రశ్నలకు 210 మార్కులు ఉంటాయి. సెషన్-1 సెక్షన్-3లో మాడ్యూల్-1 పేరుతో కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 ప్రశ్నలతో 60 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
సెషన్-2లో సెక్షన్-3 పేరుతో డేటాఎంట్రీ స్పీడ్ టెస్ట్‌ను (మాడ్యూల్-3) 15 నిమిషాల వ్యవధిలో నిర్వహిస్తారు.
పేపర్-2ను స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌తో 100 ప్రశ్నలతో 200 మార్కులకు నిర్వహిస్తారు.
పేపర్-3ని జనరల్ స్టడీస్(ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్)తో 200 మార్కులకు 100 ప్రశ్నలతో నిర్వహిస్తారు.
అన్ని పోస్ట్‌ల అభ్యర్థులు పేపర్-1కు తప్పనిసరిగా హాజరు కావాలి. పేపర్-2ను జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్‌ల అభ్యర్థులకు మాత్రమే నిర్వహిస్తారు. పేపర్-3ని అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్‌ల అభ్యర్థులకు నిర్వహిస్తారు.
టైర్-1, టైర్-2 రాతపరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.
ఆయా పోస్టులను బట్టి నెలకు రూ.25,500ల నుంచి రూ.1,42,400 జీతం ఉంటుంది. ఇతర భత్యాలు అదనం
0 comment