Tax Free Upto Rs 17 lakh Salary: రూ. 12 లక్షలు కాదు రూ. 17 లక్షల వరకూ పన్ను రహిత ఆదాయం ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం... - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

Tax Free Upto Rs 17 lakh Salary: రూ. 12 లక్షలు కాదు రూ. 17 లక్షల వరకూ పన్ను రహిత ఆదాయం ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం...

You might be interested in:

Sponsored Links

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ సందర్భంగా మధ్యతరగతి ప్రజలకు అందులోనూ ప్రత్యేకంగా ఉద్యోగులకు పెద్ద ఎత్తున 12 లక్షల రూపాయల వరకు పున్నమినహాయింపు అందించడంతో ఇప్పుడు వారి ఆదాయం పన్ను రహితంగా మారింది.

అయితే నిజానికి మీరు ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నట్లయితే రూ. 17 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఆదాయ పన్ను శాఖ అనుమతించే కొన్ని డిడక్షన్స్ మీ సాలరీ సిటిసి లో పేర్కొనల్సి ఉంటుంది. ఆదాయపన్ను చట్టం ప్రకారం అనుమతించిన ప్రత్యేకమైన భత్యాలకు అనుగుణంగా మీ సి టి సి రూపొందించినట్లయితే 17 లక్షల రూపాయల వరకు మీరు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. . ఎకనామిక్ టైమ్స్ వెబ్ పోర్టల్ పేర్కొన్న కథనం ప్రకారం కొత్త పన్ను విధానంలో శాలరీ స్ట్రక్చర్ కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.

Job Notifications Telegram Group

Job Notifications Whatsapp Group

Job Notifications YouTube Channel

టెలిఫోన్, మొబైల్ బిల్లు

సాధారణంగా ఉద్యోగులు మొబైల్ అలాగే ఇంటర్నెట్ బిల్లుల నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ టాక్స్ మినహాయింపుకు పరిమితి అనేది లేదు. కానీ ఉద్యోగ స్థాయిని బట్టి ఈ అలవెన్స్ అనేది ఉంటుంది. అయితే మీరు హెచ్ఆర్ ను సంప్రదించిన అనంతరం దీనిని సిటిసిలో పొందుపరచవచ్చు.

వికలాంగులకు ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ పై మినహాయింపు లభిస్తుంది..

సాధారణంగా వికలాంగులకు రవాణా భత్యంపై మినహాయింపు లభిస్తుంది. ఈ భత్యం ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లేందుకు అందిస్తారు. అయితే వికలాంగులుగా ఉన్న ఉద్యోగులకు నెలకు రూ. 3200 చొప్పున సంవత్సరానికి రూ. 38,400 ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇది పూర్తిగా పన్ను మినహాయింపు అందించే అలవెన్సుగా గుర్తించాలి.

కన్వేయన్స్ రీయంబర్స్ మెంట్

ఉద్యోగులు తమ ప్రయాణ ఖర్చులపై కూడా టాక్స్ ఫ్రీ రీయింబర్స్ మెంట్ పొందే అవకాశం ఉంటుంది. అయితే సాధారణంగా కొన్ని కంపెనీలు ఈ సదుపాయం కల్పిస్తాయి. అయితే ఈ భత్యం కోసం ఉద్యోగులు రవాణా బిల్లులను సమర్పించాాల్సి ఉంటుంది. ఈ మినహాయింపును మీ సాలరీలో పొందాలనుకుంటే మీ కంపెనీ హెచ్ఆర్ తో మాట్లాడాల్సి ఉంటుంది.

కార్ లీజ్ పాలసీ

ఉద్యోగులు టాక్స్ మినహాయింపు పొందేందుకు మరో మార్గం కూడా ఉంది. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు కారు లీజ్ సర్వీసును అందిస్తాయి. ఇది పన్నుమినహాయింపు రూపంలో తక్కువే కానీ, నెలకు రూ.1800 వరకూ మినహాయింపు లభించే అవకాశం ఉంటుంది. గరిష్టంగా రూ. 2400 వరకూ మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది.

ఇక ఇతర మినహాయింపుల విషయానికి వస్తే

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ. 75000 వరకూ పెంచింది. ఇది కూడా వర్తిస్తుంది. ఇక ఉద్యోగి వేతనంలో చెల్లించే ఎన్పీఎస్ స్కీం ద్వారా 14 శాతం వరకూ పండు మినహాయింపుల ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక అలాగే ఉద్యోగి వేతనంలో 12% పిఎఫ్ కట్ అవుతుంది ఇది కూడా పూర్తిస్థాయిగా పన్ను మినహాయింపుగా భావించవచ్చు. ఈ మొత్తం మినహాయింపులను ఉపయోగించుకుంటే దాదాపు రూ. 17 లక్షల వరకు జీతం టాక్స్ ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE